ఒకవేళ నిజంగానే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున అంటే జనవరి 12న విడుదల అయితే తప్పకుండా ఇద్దరికీ నష్టాలు తప్పవు అందువల్ల అభిమానులు సహా బయ్యర్లు కూడా భయపడుతున్నారు. దీనితో ఈ సమస్యకు ఒక ముగింపు ఇవ్వాలని మహేష్ మరియు బన్నీలు అనుకుంటున్నట్టు సమాచారం. పండగకి ఎక్కువగా సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. ఇద్దరు పెద్ద స్టార్లు థియేటర్ల సమస్య వస్తుందనే భావనతో ఇటు బయ్యర్లు, అటు ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం పై ప్రొడ్యూసర్లు కూర్చుని చర్చించుకుంటారు. ఇది ఒక ఆచారం గతంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి. మరి వీళ్ళిద్దరే కాకుండా బాలకృష్ణ సినిమా కూడా అప్పుడే విడుదలయ్యే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి షూటింగ్ లో బిజీ గా ఉన్న వీరు వీలు చూసుకొని తమ తమ నిర్మాతలు, చిత్ర యూనిట్లతో కలిసి ఒక మీటింగు ఏర్పాటు చేసి విడుదల తేదీల పట్ల ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోడానికి ఆలోచిస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు తగ్గుతారో ఎవరు తగ్గరో చూడాలి.