రష్మిక మందన్న తన అందం అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ని రాణిస్తుంది. చలో సినిమా ద్వారా తెలుగు లో అరంగేట్రం చేసిన ఈ కన్నడ పిల్ల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతుంది. డియర్ కామ్రేడ్ సినిమాలోని లిల్లీ పాత్ర చేసిన ఈమె తెలుగు సినీ అభిమానులను ఫిదా చేసింది. అలా తన పాపులారిటీ పెంచుకుంటూ వెళ్తున్న రష్మిక తాజాగా ఒక బ్యాక్ ఫ్లిప్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాక్ ఫ్లిప్ చేస్తున్న క్లిప్ ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. 


వెనకకి తిరిగి పిల్లి మొగ్గలు వేసిన రష్మిక మందన్న ఫిట్నెస్ చూసి తన అభిమానులు అబ్బా ఏం చేసింది! అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మన సౌత్ సినిమా హీరోయిన్స్ లో ఫిట్నెస్ పై బాగా శ్రద్ద పెట్టె వాళ్లలో రష్మిక ఒకటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. బ్యాక్ ఫ్లిప్ చేయడం రష్మిక కి ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా బ్యాక్ ఫ్లిప్ చేసింది. నిజానికి చాలా మంది సినీ అభిమానులు తమకి ఇష్టమైన హీరో/హీరోయిన్స్ లాగా ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు.

అయితే ఈ ఉద్దేశం తోనే రష్మిక మందన్న తరచుగా తన ఫిట్నెస్ వర్క్ అవుట్ ని సామజిక మాధ్యమాలలో అప్లోడ్ చేస్తూ తన అభిమానులకి ఫిట్నెస్ గోల్స్ ని పెంచుతుంది. ఓ బేబీ నటి సమంత అక్కినేని కూడా ఎన్నో వర్క్ అవుట్ వీడియోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసింది. వరల్డ్ ఫేమస్ డబ్లుడబ్లుఈ రెస్లర్ అంటే కుస్తీ ఆటగాడు అయినా ది రాక్ కూడా ఫిట్నెస్ వర్క్ అవుట్ లు చేసి తన అభిమానులకు ఫిట్నెస్ గోల్స్ ని పెంచుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: