ఒకప్పుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లు వసూళు చేస్తే చాలు అని అనుకునే వారు.. అది కాస్త 100 కోట్లు అయ్యింది. స్టార్ సినిమాలు ఇప్పుడు కరెక్ట్ కంటెంట్ తో రావాలే కాని 200 కోట్లు కూడా ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. సౌత్ లో తెలుగు, తమిళ భాషల సినిమాలే ఈ కోట్ల కలక్షన్స్ కు పరుగెడుతున్నాయి.


ఇదిలాఉంటే అసలేమాత్రం అంచనాలు లేకుండా రీసెంట్ గా వచ్చిన కార్తి ఖైది సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖైది. ఈ సినిమా తెలుగులో కూడా ఖైది టైటిల్ తో రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ తో ఈ సినిమా రావడం చాలా ప్లస్ అయ్యింది.


తెలుగులో ఈమధ్య తమిళ సినిమాలకు పెద్దగా వసూళ్లు రావట్లేదు. కాని కార్తి ఖైది తెలుగులో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులో ఈ సినిమాను కె.కె. రాధామోహన్ రిలీజ్ చేశారు. తమిళంలో కూడా ఇళయదళపతి విజయ్ లాంటి స్టార్ హీరో బిగిల్ తో పోటీకి దిగి అక్కడ విజయడంఖా మోగించింది ఖైది సినిమా.


తెలుగులో హిట్ అనిపించుకోవడమే కాదు సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు వచ్చేలా చేసింది. అయితే తెలుగులో విజిల్ సినిమా కూడా మంచి కలక్షన్స్ రాబట్టింది. కాని విజిల్ కన్నా ఖైది సినిమాకే మౌత్ టాక్ బాగా ఉంది. అదీగాక తెలుగులో ఖైది ప్రమోషన్స్ కోసం కార్తి హైదరాబాద్ టూ చెన్నై చెక్కర్లు కొట్టాడు. అందుకే తెలుగు ప్రేక్షకులు కార్తి ఖైదికి ఇంత గొప్ప సక్సెస్ అందచేశారు. ఖైది సక్సెస్ జోష్ తో జ్యోతికతో చేస్తున్న జాక్ పాట్ సినిమాను తెలుగులో తమ్ముడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కార్తి ఈ సినిమాలో జ్యోతికకు తమ్ముడిగా నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: