ఇప్పటి వరకు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కథలో ‘ఆగడు’ కామెడీ ట్రాక్ కనిపిస్తుంది అంటూ లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఈ సినిమా గురించి వస్తున్న ఒక లేటెస్ట్ లీక్ ఏకంగా ఈ సినిమాను చూసే వారికి మహేష్ ‘మహర్షి’ సినిమా మళ్ళీ గుర్తుకు వస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ స్నేహితుడి పాత్ర కీలకం అని తెలుస్తోంది. 

అంతేకాదు కథలోని ఒక మేజర్ ట్విస్ట్ ఈ ఫ్రెండ్ పాత్ర ద్వారా వస్తుంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫ్రెండ్ పాత్రను అప్ కమింగ్ హీరో సత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘జ్యోతి లక్ష్మి’ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సత్య ఈ వారం విడుదల కాబోతున్న ‘రాగల 24 గంటలలో’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 

అతడి చేత ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ను అనీల్ రావిపూడి చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్నేహితుడు పాత్రకు మహేష్ పాత్రకు ఉన్న స్నేహం ఎలా ఏర్పడింది అన్న క్లారిటీ లేకపోయినా ఈ సినిమాలో వీరిద్దరి పేర్లు ఒకటే అన్న ప్రచారం జరుగుతోంది. ‘సరిలేరు నీకవ్వరు’ లో మహేష్ పాత్ర పేరు అజయ్ కృష్ణ కావడంతో తిరిగి సత్య పాత్ర కూడ ఇదే పేరుతో ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

దీనితో ఈ మూవీలో అనీల్ రావిపూడి చేస్తున్న ప్రయోగం పై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు తన సినిమాలలో ఎదో ఒక మ్యాజిక్ చేసి జనాన్ని మెప్పించి విపరీతంగా నవ్వించడంలో సక్సస్ అవుతున్న అనీల్ రావిపూడి మహేష్ మూవీలో కూడ ఎదో ఒక మ్యాజిక్ చేసి ఉంటాడు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: