ప్రస్తుత కాలంలో బట్టతల రావడం కామన్. ఇప్పుడు ఎక్కడ  చూసిన వెంట్రుకలు ఉన్న వాళ్ళ కంటే బట్టతల ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం ఓ వైపు కాలుష్యం పెరిగి పోవడం మరో వైపున నాణ్యత లేని తిండి ఇలా ప్రతి ఒక్కటి హెయిర్ ఫాల్ కు కారణమైపోతుంది ... ఇక చివరికి బట్టతల వచ్చే వరకు దారి తీస్తోంది. అయితే ప్రస్తుతం ఎంతో మంది బట్టతలతో బాధపడుతున్నప్పటికీ...  కొంతమంది హెయిర్ ప్లాంటేషన్ చేసుకొని బట్టతలను కవర్ చేస్తున్నారు. అయితే బట్టతల వల్ల కొంతమంది చాలా  బాధపడుతూ ఉంటారు కూడా. అయితే తాజాగా బట్టతల ఉన్న వారి బాధలు ఎలా ఉంటాయో తెలువుతూ  బాలీవుడ్లో తాజాగా బాలా  అనే మూవీ వచ్చింది. 

 

 

 

 బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా,  భూమి పెడ్నేకర్,  యామీ గౌతమ్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంకీ  మంచి స్పందన వస్తోంది. సినిమాల బట్టతల ఉన్న వారి బాధలను చూపిస్తు తెరకెక్కిన  ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాగా  సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో హీరో కు భార్యగా యామి గౌతమ్ నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న యామి గౌతమ్  ... బాల అనే సినిమాలో బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు కదా... మీ  నిజ జీవితంలో కూడా బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు  ఆసక్తికర సమాధానం చెప్పింది  యామి గౌతమ్

 

 

 

 చేసుకుంటాను ఎందుకు చేసుకోకూడదు అంటూ సమాధానం ఇచ్చింది. నిజానికి బట్టతల ఉన్నటువంటి వారు  చాలా శాంత స్వరూపం అని ఉన్న వ్యక్తులు అని తెలిపింది.  ముందుగా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలి సూచించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వేరే వాళ్ల దగ్గర నుంచి ప్రేమను కోరాలి అని సూచించింది. తమ బాలా  సినిమా ఉద్దేశం కూడా అదేనంటూ చెప్పుకొచ్చింది . అయితే ఈ ప్రయోగాత్మక చిత్రం  ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ  మంచి వసూళ్లు  రాబట్టేందుకు దూసుకుపోతుంది సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: