జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మి ఈ బుల్లి తెర యాంక‌ర్ తెలియ‌ని వాళ్ళుండ‌రు. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ తో మ‌రింత ఎక్కువ క్రేజ్‌ను సంపాదించింది ఈ భామ‌. ఇక హీరోయిన్ గా కూడా ఈ భామ ఈ మ‌ధ్య కాలంలో చాలా సినిమాల్లో నటించింది. గుంటూర్ టాకీస్ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని కుర్రాకారుకి పిచ్చేక్కించింది. అయితే ఆమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినప్పటికి ఏవి పెద్దగా ఆడలేదు. కథనాయికగా సెటిల్ అవుదాం అనుకున్న రష్మీకి నిరాశ మిగిలింది.


అయినప్పటికి ఇంకా హీరోయిన్ గా చేస్తూ తన లక్ ను టెస్ట్ చేసుకుంటుంది. రష్మీ అందాలు అరబోయడంలో ముందు ఉంటుంది. అందుకే ఆమెకి వద్దు అన్న ఆఫర్స్ వెతుకుంటూ వస్తాయి. ఆమె ప్రస్తుతం కొత్త కథలు వింటుంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కి కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ బెస్ సిరీస్ లో రష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్ అని తెలుస్తోంది. ఏంటా సర్ ప్రైజ్ అంటే… రష్మి ఈ వెబ్ సిరీస్ లో స్వలింగ సంపర్కురాలి (లెస్బియన్) పాత్ర లో కనిపించనుందట.


ఇదే కనుక నిజమైతే రష్మీ అందాల అరబోతా ఉడటం ఖాయం. అసలే బోల్డ్ బ్యూటీ.. దాంతో వెబ్ సిరీస్ లో ఆవిరులు పుట్టించడం గ్యారెంటీ అంటూ వాడి వేడి ముచ్చట‌ సాగుతోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌లు దుమ్ము రేపుతున్నాయి. దాంతో పెద్ద పెద్ద స్టార్స్ సైతం సినిమాలు చేస్తూనే వాటిలో నటిస్తున్నారు. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, నేహా దూపియా, మనీషా కోయిరాలా సహా పలువురు తారలు లస్ట్ స్టోరీస్‌లో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: