యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య దాదాపుగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్స్ గురించి, అలానే వారిద్దరి ఫేస్ లు క్లోజప్ లో కనపడేలా ఒక చిన్న పోస్టర్ ని మాత్రమే సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. 

ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక న్యూస్ బయటకు రాకపోవడంతో సినిమా ప్రేక్షకులు ఎంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ ఒట్టి ఫేక్ మాత్రమేనని, కాగా ఈ సినిమా అధికారిక టైటిల్ ని సరిగ్గా రాబోయే న్యూ ఇయర్ రోజైన జనవరి 1న ప్రేక్షకులకు రివీల్ చేయనున్నట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి గట్టిగా వార్తలు వస్తున్నాయి. 

నిజానికి ఈ సినిమా టైటిల్ విషయమై ఇప్పటికే రాజమౌళి మరియు ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగిందని, అయితే సినిమా టైటిల్ గా అందరూ కలిసి ఏది ఫిక్స్ చేసారు అనేది తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది తొలి రోజు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ కెమెరామ్యాన్ గా అలానే రాజమౌళి తండ్రి వివిజయేంద్రప్రసాద్ కథను అందించడం జరుగుతోంది. కాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2020 జులై 30న రిలీజ్ చేయడం ఖాయమట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: