2020 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కాబోతుంది. మహేశ్ బాబు, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. 
 
మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా విడుదలై హిట్ అయిన తరువాత తన వాటాను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా హక్కులు భారీ మొత్తానికే అమ్ముడైనప్పటికీ చరణ్ రికార్డును మాత్రం మహేశ్ బాబు బ్రేక్ చేయలేకపోయాడు. 
 
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు బాలీవుడ్ లో 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొదటి స్థానంలో రామ్ చరణ్ ఉండగా రెండవ స్థానంలో మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన మహర్షి సినిమా ఉంది. ఈ సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. 
 
మూడవ స్థానంలో ఎన్టీయార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఉంది. ఈ సినిమా బాలీవుడ్ శాటిలైట్, డిజిటల్ హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. నాలుగవ స్థానంలో మహేశ్ ప్రసుత్తం నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మార్కెట్ డౌన్ కావటంతో సినిమాలను గతంతో పోలీస్తే తక్కువ రేట్లకు బాలీవుడ్ బయ్యర్లు కొంటున్నారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: