డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారిన రవితేజ అంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.  డైరెక్టర్ గా మారలని సినీ పరిశ్రమలోకి వచ్చిన రవితేజ..అనూహ్యంగా నటుడిగా మారారు.  ఇడియట్ సినిమాతో మాస్ ఇమేజ్ సంపాదించిన రవితేజ తర్వాత కూడా ఆ తరహా మాస్ సినిమాల్లో నటిస్తూ వచ్చారు.  రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ వరుస విజయాలు అందుకుంటూ వచ్చారు. 


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘కిక్’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.  కిక్కు కోసం హీరో ఎంతటి సాహసానికైనా తెగబడతాడని ఈ మూవీలో చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించారు.  ఈ మూవీతో రవితేజకు మరింత స్టార్ డమ్ వచ్చింది.  అయితే కిక్ 2 మాత్రం ఆ విజయం అందుకోలేక పోయింది. ఇక రెండు సంవత్సరాలు విరామం తీసుకున్న రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ మూవీతో మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. 


ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ. ఈ మూవీ తర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు.  తాజాగా ఈ మూవీ టైటిల్ రిలీజ్ చేశారు. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించ‌నున్నాం అని గోపిచంద్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు. నవంబ‌ర్ 14న ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు.థ‌మ‌న్ మూవీకి  సంగీతం అందిస్తున్నారు . శృతి హాస‌న్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం.



మరింత సమాచారం తెలుసుకోండి: