తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు (79) ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్య నిపుణులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇక ఇదిలా ఉంటే కాస్త వింట‌ర్ సీజ‌న్ మొద‌ల‌వ‌డంతో ఆయ‌న న్యూమోనియా మ‌రి కాస్త ఎక్కువ‌యిందని  స‌మాచారం. అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాహుబలి వంటి సూపర్ సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాతో సందడి చేసాడు. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా మంచి కలెక్షన్సే రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 1970-80 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. ‘సాహో’ తర్వాత ప్రభాస్..పారిస్‌లోనే తన వెకేషన్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన హీరో కాదు. ఒక రకంగా భారతదేశానికి పరిమితం అయితే ఇంకో రకం. కానీ ఇపుడు ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 


ఇటీవ‌లె కృష్ణంరాజుని ప్ర‌భాస్ రాజ‌కీయాల ఎంట్రీ గురించి అడిగితే దాని గురించి  ఆయ‌న ఈ విధంగా స్పందించారు. ప్రభాస్‌ రాజకీయాల్లోకి వస్తాడా ? రాడా ? అనేది ఇపుడు నిర్ణయించడం సమంజసం కాదన్నారు. గతంలో బాహుబలి సినిమా సక్సెస్ తర్వాత కృష్ణంరాజు తన వెంట ప్రభాస్‌ను తీసుకెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే  ప్రభాస్ రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నారనే మాట పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడింది.  అంతేకాదు త్వరలోనే కమలం తీర్ధం పుచ్చుకోనున్నారనే టాక్ వినబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: