ముద్దు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెబుతోంది అందాలభామ తమన్నా. 'కెరీర్ మొదట్లోనే ముద్దు సీన్లు చేయకూడదని రూల్ పెట్టుకున్నాను. అది నా కాంట్రాక్టులో కచ్చితంగా వుంటుంది. ఇప్పటికీ దానిని పాటిస్తున్నాను. ఇక ముందు కూడా తెరపై ముద్దు సీన్లు చేయను' అని తెగేసి చెప్పింది తమన్నా.  మరి ఇలాంటి రూల్స్‌కి ప్రొడ్యూస‌ర్లు ఒప్పుకుంటున్నారా. అప్ప‌ట్లో ఇలాంటి కండీషన్స్ అన్నీ సీనియ‌ర్ న‌టి సౌంద‌ర్య ఎక్కువ‌గా పెట్టేది. మ‌రి ప్ర‌స్తుతం వ‌చ్చే సినిమాల‌న్నిటిలో చాలా వ‌ర‌కు ఇలాంటి సీన్లు ఎక్స్‌పోజింగ్ అనేది హీరోయిన్ల‌కి కామ‌న్ అయిపోయింది. 


ఇక‌పోతే మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌‌లో మరో సినిమా వస్తోంది. ఆ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆ చిత్రంలో త‌మ‌న్నా, గోపీచంద్ క‌బ‌డీ కోచ్‌లుగా చేస్తున్నారు.  గత 13 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తున్నానని అప్పటి నుంచి నాకు ముద్దు సీన్స్ అంటే ఇష్టం లేదని తెలిపింది…. ఇప్పటి నుంచి కూడా ముద్దు సీన్స్ విషయాల్లో ఎలాంటి మార్పులేదని మిల్కీ బ్యూటి స్పష్టం చేసింది… ఇటీవలే కాలంలో ముద్దు సీన్స్ లలో నటించి కమర్శియ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్స్ పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు…


కానీ తమన్న ముద్దులకు హద్దు పెట్టడంతో అవకాశాలు తక్కువ వస్తున్నాయి.. ప్రస్తుతం వస్తున్న అడపాదడప అవకాశాలను వినియోగించికుని మళ్లీ బిజీ అవ్వాలని చూస్తోంది మిల్కీ బ్యూటి. కథానాయికకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని భావించడం లేదు. అన్ని చిత్రాల్లో నటించాలన్నదే ఆశ. ప్రస్తుతం బయోపిక్‌లలో నటించాలనుంది. అందులోను శ్రీదేవి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటాను. హీరోయిన్ గా నటిస్తూనే, అప్పుడప్పుడు స్పెషల్ సాంగులలో డ్యాన్స్ చేసే తమన్నా తాజాగా  సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పక్కా మాస్ బీట్ తో పాటను కంపోజ్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావెపూడి.


మరింత సమాచారం తెలుసుకోండి: