తెలుగు అందాల తార బిగ్ బాస్ ఫేమ్ అర్చ‌న వివాహం హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో ఘ‌నంగా జ‌రిగింది.  13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరిగింది.  అయితే నిన్నటి నుంచే అర్చన ఇంట వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి జరగనున్న గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.


ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా వారితో కాలు కదిపారు. సంగీత్ కార్యక్రమానికి వధూవరుల తల్లిదండ్రులతోపాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చ‌న‌- జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.   


తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటించింది.  అర్చన రెండో ఏటే నాట్యం ఈమె జీవితంలోకి ప్రవేశించింది.  అర్చన తల్లిగారు కూడా నర్తకి. పేరు విజయశాస్త్రి. చిన్నప్పట్నుంచీ అమ్మ నాట్యాన్ని చూస్తుండేది. చూసి చేసేది. ఈమె లోని జిజ్ఞాసను గమనించి పసి ప్రాయం నుంచే నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టింది.


ఆ తర్వాత సినిమాల్లో నటించాలని తపనతో..నటన కూడా నేర్చుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నేను ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.   తెలుగు బిగ్ బాస్ 1 రియాలిటీ షో లో పాల్గొని చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. అర్చ‌న చివ‌రిగా ‘వజ్ర కవచధర గోవింద’ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టాలీవుడ్ లో మొదట అర్చనగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వతా వేదగా పేరు మార్చుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: