ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ మూవీస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బయోపిక్ లు వచ్చాయి. తాజాగా  తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఇటీవలే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. ఇక బాలీవుడ్ సంచలన తార కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది..ఎంజీఆర్. ఆయన సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 


సినీరంగంతో పాటు, రాజకీయరంగంలోనూ కీలక వ్యక్తిగా మెలిగిన జయలలిత జీవితచరిత్ర తీస్తున్నారంటే..లెజెండ్స్‌ని తెరపైన చూపించాల్సి ఉంటుంది. కాగా, ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌‌లను ఫైనల్ చేశారు. తాాజాగా విశ్వవిఖ్యాతనటసార్వభౌమ ఎన్టీఆర్ పాత్రకు కూడా నటుడ్ని సెలక్ట్ చేసినట్టు సమాచారం. కాకపోతే ఈ విషయం అఫిషియల్ గా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే..జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప‌లు సినిమాలు తెర‌కెక్కుతుండ‌గా, కొన్ని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ..‘శశి లలిత’ పేరిట ఓ మూవీ తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది చూపించబోతున్నారు. 


అంతే కాదు తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. మరోవైపు వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో జయ పాత్రలో కంగనా నటిస్తుండగా..ఎంజీఆర్ పాత్రలో అలనాటి అందాల నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ లుక్ తాజాగా విడుద‌లైంది. షూట్‌లో పాల్గొనే ముందు అర‌వింద్ స్వామి ఫోటోకి ఫోజిచ్చారు. ఆ పిక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: