బాలల దినోత్సవ సందర్భంగా ఈరోజు అత్యంత ఘనంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ‘నాడు నేడు’ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ ను కార్పోరేట్ స్కూల్స్ గా మార్చి విద్యా ప్రమాణాలు పెంపొందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ పాఠశాలల అభివృధికి ప్రారంభింప బడ్డ నేటి కార్యక్రమం ఒక ఉద్యమంలా మార్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడానికి వేలాది కోట్లు ఈ కార్యక్రమం పై వెచ్చించబోతున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 8వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి తన ఉపన్యాసంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెడుతున్నందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియ చేస్తూ ఏకంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ లాంటి ఒక టాప్ హీరో ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేయడం తన ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అంతేకాదు సరిగ్గా తెలుగు కూడ మాట్లాడటం రాని నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడ ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకిస్తూ తమకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం వస్తున్నందుకు ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ ఆ అమ్మాయి తన వయసుకు మించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి 8వ క్లాసు చదువుకునే ఒక అమ్మాయికి రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. 

అయితే అలాంటి చిన్నవయస్సులో ఉన్న ఆ అమ్మాయి కూడ ఇంగ్లీష్ మీడియం తనకు కావాలి అంటూ ధైర్యంగా చెప్పిన మాటలు ప్రస్తుతం చిన్న పిల్లలో విద్య పట్ల పెరుగుతున్న ఆసక్తికి దర్పణంగా మారాయి. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించిన ఈ పధకం విజయవంతం అయితే రానున్న సంవత్సరాలలో అక్షరాస్యతలోనే కాదు విజ్ఞానంలో కూడ ఆధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: