మెగా హీరోల వల్లే ఆ బ్యూటీకి ఛాన్స్ లు రావడం లేదా?  మెగా హీరోలను నమ్ముకుంటే నట్టేట ముంచేశారా? స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాల్సిన బ్యూటీ ఫేడవుట్ కావడానికి పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ కారణమా..? అంతగా మెగా కాంపౌండ్ ఆదుకుంటుందని ఆశపడ్డ ఆ బ్యూటీ ఎవరు?  ఈ బ్యూటీకి ఛాన్స్ లు రాకపోవడానికి పవన్, బన్నీ ఎలా కారణమయ్యారు ? 


లండన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ స్వప్న సంచారి అనే మళయాళీ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక నానీ హీరోగా నటించిన మజ్ను సినిమాతో 2016లో తెలుగు తెరకు పరిచయమైంది. బ్యూటీ గ్లామర్ చూసిన ఆడియన్స్ టాలీవుడ్ కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికినట్టే అనుకున్నారు. కట్ చేస్తే పట్టుమని అరడజన్ సినిమాలు చేయకుండానే అమ్మడు తిరిగి లండన్ చెక్కేసింది. 


అను ఇమ్మాన్యుయేల్ మొదటి సినిమా మజ్ఞు మంచి విజయమే అందుకుంది. ఆ తర్వాత రాజ్ తరుణ్ కి జోడీగా నటించి కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమా సైతం  మోస్తరుగా ఆడింది. ఆ టైమ్ లో ఈ బ్యూటీకి అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ సినిమాతో అను ఫేట్ మారిపోతుందనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. దీనికి తోడు గత ఏడాది అల్లు అర్జున్ తో నటించి నా పేరు సూర్య సైతం ఈ బ్యూటీకి భారీ షాక్ ఇచ్చింది. 


హీరోయిన్ గా రేంజ్ మార్చేస్తాయనుకున్న అజ్ఞాతవాసి, నా పేరు సూర్య డిజాస్టర్స్ అను ఇమ్మాన్యుయేల్ కు ఛాన్స్ లు లేకుండా పోయాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అను ఇదే విషయాన్ని చెప్పడం విశేషం. పాత్ర పరిధి గురించి పట్టించకోకుండా స్టార్స్ సినిమాలు చేయడం వల్లే తనకు ఛాన్స్ లు దక్కకుండా పోయాయని ఫీలైంది. మొత్తానికి సక్సెస్ ఇచ్చి రేంజ్ మార్చేస్తారనుకున్న పవర్ స్టార్, స్టైలీష్ స్టార్ అను పాపకి డిజాస్టర్స్ ఇచ్చి కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ చిన్న సినిమా చేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: