తమిళ హీరో కార్తీ ఖైదీగా బాక్సాఫీసును లూటీ చేశాడు. ఈ సినిమా కార్తీ వెలితిని తీర్చేసింది. ఎక్స్ పెరిమెంటల్ మూవీగా తెరకెక్కిన ఖైదీ ఎవరూ ఊహించని స్థాయి విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా కార్తీ కి సాధ్యం కాని ఫీట్ ఖైదీతో నెరవేరింది. 


తమిళ హీరో కార్తీ కెరీర్ లో చాలా హిట్ సినిమాలున్నాయి. కానీ భారీ వసూళ్లు సాధించిన సినిమాలు మాత్రం పెద్దగా లేవు. కార్తీ సినిమాలు తమిళంలో 50కోట్ల గ్రాస్ రేంజ్ కు కూడా ఎప్పుడూ వెళ్లలేదు. ఖైదీ సినిమా ముందు వరకు ఈ తమిళ హీరో సూపర్ హిట్ సినిమాలు కూడా 40కోట్ల లోపే కలెక్ట్ చేశాయి. కానీ ఇప్పుడు ఖైదీ సినిమాతో కార్తీకి ఆ వెలితి తీరింది. ఖైదీ కోలీవుడ్ లో ట్రేడ్ వర్గాలు ఊహించని రేంజ్ లో వసూళ్లు దక్కించుకుంది. 


దీపావళికి కోలీవుడ్ బిగ్ స్టార్ విజయ్ బిగిల్ తో పాటు కార్తీ.. ఖైదీ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. బిగిల్ సినిమా హవాను తట్టుకొని ఖైదీ తొలి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాటలు, హీరోయిన్ లేకుండా తీసిన ఈ సినిమా ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అవుతుందోనని అంతా అనుకున్నారు. కానీ ట్రేడ్ వర్గాల అంచానాలను తలకిందులు చేస్తూ ఖైదీ సినిమా మూడు వారాల్లో 100కోట్లు కలెక్ట్ చేసింది. కార్తీ కెరీర్ లోనే ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 


కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద 70కోట్లు రాబట్టిన ఖైదీ మిగతా మొత్తాన్ని తెలుగు, కర్ణాటక, కేరళ డబ్బింగ్ వెర్షన్ నుండి రాబట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఖైదీ అసాధారణ వసూళ్లు సాధించింది. కేవలం 300 థియేటర్లలో మాత్రమే రిలీజైన ఖైదీ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంపై కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. 4కోట్లకు ఖైదీ తెలుగు హక్కులు అమ్ముడు పోయాయి. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా 9కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. దర్శకుడు కనకరాజ్ ఖైదీకి సీక్వెల్ గా ఢిల్లీ 2 ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: