మెగాస్టార్ చిరంజీవి నటించిన 270 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2 న విడుదలైన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క తెలుగులో తప్ప మిగతా దక్షిణాది భాషల్లో సైరా బిజినెస్ చేయలేకపోయింది. అంతేకాదు హిందీలో కూడా ప్రీ బిజినెస్ పరంగా అంచనాలు అందుకో లేకపోయింది. లెజెండరీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించిన మార్కెట్ పరంగా అంతగా కలిసి రాలేదు. బాహుబలి రేంజు బిజినెస్ ఆశిస్తే .. అసలు సైరా ను అక్కడ పంపిణీ వర్గాలు లైట్ తీస్కోవడం ఆశ్చర్య పరిచింది. ఒక తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడి కథను ఉత్తరాది జనం ఆదరించరని హిందీ మార్కెట్ వర్గాలు భావించాయి. ఇక ప్రచారం పరంగానూ సైరా టీమ్ వెనకబడడం..పబ్లిసిటీ సమయంలో ఎదురైన అడ్డంకులు అన్నీ మైనస్ అయ్యాయి. ఆ సమయంలో 'సైరా' కి పోటీగా దిగిన హాలీవుడ్ 'జోకర్', బాలీవుడ్ 'వార్' అద్భుతమైన కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇక హాలీవుడ్ 'జోకర్' సినిమా అయితే రికార్డ్స్ ని సృష్ఠిస్తోంది. 

ఇక సైరా హిందీ రైట్స్ 9 కోట్లకు అమ్ముడు పోయాయని ఫర్హాన్-తడాని బృందం తో కొణిదెల టీమ్ భాగస్వామ్య డీల్ కుదుర్చుకున్నారని ప్రచారమైంది. ఇప్పటివరకూ ఈ డీల్ చిరు కెరీర్ లోనే ది బెస్ట్. హిందీ రైట్స్ పరంగా రికార్డు అనే చెప్పాలి. ఇప్పటివరకూ నాన్ బాహుబలి కేటగిరీలో ఏ తెలుగు హీరో సినిమా ఇన్ని కోట్లకు బాలీవుడ్ లో అమ్మడు పోయింది లేదని ఇండస్ట్రీ టాక్. ఆ రకంగా ఇమేజ్ పరంగా చిరు కి తిరుగు లేదనే చెప్పాలి. 

అయితే తాజాగా ఆ రికార్డు ను మహేష్ బాబు బ్రేక్ చేసాడు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు హిందీ రైట్స్ 15.25 కోట్లకు సేల్ అయినట్లు ఫిల్మ్ నగర్ తాజా సమాచారం. డబ్బింగ్- శాటిలైట్- డిజిటల్ రైట్స్ కలిపి ఇంత మొత్తం చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. సరిలేరు దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 ని హిందీలో రీమేక్ చేస్తున్న సందర్భంగా అనిల్ ఇమేజ్ అక్కడ కొంతవరకు ప్లస్ అయ్యిందని ఈ రకంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న హిరోయిన్ గా నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: