యాంకర్ రవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సగటు తెలుగు ప్రేక్షకుడి యాంకర్ రవి సుపరిచితుడే. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు యాంకర్ రవి . అంతే కాకుండా ఎప్పుడు ఫుల్ జోష్ లో ఉంటూ ఎంతో ఎనర్జీ తో  యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు ఎనర్జీ ని పంచుతూ  ఉంటాడు. ఇక తనదైన స్టైల్ లో మాటలతో మాయ చేసి ప్రోగ్రాం రక్తి కట్టించడం యాంకర్ రవి స్పెషాలిటీ. యాంకర్ రవి  బుల్లితెరపై పటాస్ షో  లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన యాంకర్ రవి... తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ లో  యాంకర్ గా మారిపోయి మరిన్ని నవ్వులు  పంచుతూన్నాడు. బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ ఉన్న  రవి స్పెషాలిటీ ఏ వేరు. 

 

 

 

 యాంకర్ రవి ఓ వైపు  బుల్లితెర పైన షోలు చేస్తూనే...  మరో వైపు  సినిమాల్లో కూడా చేసుకుంటూ సాగిపోతున్నారు. అంతేకాదండోయ్ ఓ సినిమాలో హీరోగా కూడా నటించారు. రవి  ఏదైనా ప్రోగ్రాం కి యాంకరింగ్ చేస్తున్నాడంటే పంచుల వర్షం కురుస్తుంది. ఇక లేడీ యాంకర్స్ ఎవరైనా రవితో యాంకరింగ్ చేస్తున్నారంటే రవి ఎనర్జీని అందుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. లేడీ యాంకర్లతో  రవి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. అయితే ప్రస్తుతం యాంకర్ రవి ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వులను పంచుతున్నారు. అయితే ప్రస్తుతం రవి పటాస్ ప్రోగ్రాం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

 

 అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. యాంకర్ రవి పటాస్ షో తో పాటు ఒక శాటిలైట్ ఛానల్ తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పటాస్ షో నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ... చేస్తే కేవలం పటాస్ షో ని మాత్రమే చేయాలని వేరే ప్రోగ్రామ్స్  చేయడానికి వీల్లేదంటూ కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక పటాస్ షో కి యాంకర్ రవి గుడ్ బై  చెప్పబోతున్నాడు అని సమాచారం . దీనికి సంబంధించి ఇప్పటికే మల్లెమాల సంస్థ కూడా సమాచారం అందించారట  యాంకర్ రవి. పటాస్ లో రవి స్థానంలో నోయల్ లేదా జబర్దస్త్ కమెడియన్ చంటి  పేర్లను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: