తమిళ చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య, కమెడియన్ల మధ్య గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులో ఉన్నవాళ్లు నటిస్తున్న సినిమాల్లో వాళ్ళు నటించకూడదు. మరో గ్రూపు వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ముఖ్యంగా కమెడియన్లు ఎప్పుడో గ్రూపులుగా విడిపోయారు. అలాంటి కమెడియన్లలో తమిళ టాప్ కమెడియన్ వడివేలు కూడా ఉన్నాడు. ఈయన కొందరి టాప్ హీరో సినిమాల్లో కూడా నటించడం మానేశాడు. మానేశాడు అనేకంటే.. గ్రూపు రాజకీయాల్లో భాగంగా తీసుకోలేదు. ఇక్కడ సినిమాల్లో రాజకీయాలూ ప్రధాన పాత్ర పోషిస్తాయి.





అలా స్టార్ హీరో అజిత్ సినిమాల్లో కూడా నటించలేదు. వీరిద్దరికీ ఏర్పడిన అభిప్రాయబేధాలకు.. ఇండస్ట్రీ గ్రూపు రాజకీయాలకు తోడై అజిత్ సినిమాల్లో వడివేలు నటించలేదు. వీరిద్దరూ కలిసి నటించి 17 ఏళ్ళు పూర్తయ్యాయి. 2002లో వచ్చిన రాజా సినిమాలో నటించిన తరువాత అజిత్ - వడివేలు కామెడీ తెరపై కనిపించలేదు. ఇప్పుడు అజిత్ నటిస్తున్న 60వ చిత్రం 'వళిమై' సినిమాలో వడివేలు నటిస్తున్నాడు. దీంతో వడివేలు కామెడీ అంటే ఇష్టపడే తమిళ ప్రేక్షకులకు మళ్లీ వినోదం షురూ కాబోతోంది. తొంభైల్లో వడివేలు తమిళ్ లో స్టార్ కమెడియన్. ఇప్పటికీ స్టార్ స్టేటస్ ఉన్నా చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో హీరోగా కూడా ట్రై చేసాడు.




మళ్లీ ఇన్నేళ్ళకి ఈ స్టార్ హీరో సినిమాలో ఈ స్టార్ కమెడియన్ నటించబోతున్నాడు. ఇదొక్కటే కాదు వడివేలుకు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయట తమిళ్ లో. అందులో శంకర్ - కమల్ హాసన్ మూవీ భారతీయుడు-2 కూడా ఉందని సమాచారం. మొత్తానికి ఈ న్యూస్ అజిత్ అభిమానులకు, వడివేలు అభిమానులకు సంతోషం కలిగించే వార్తే. తమిళ ప్రేక్షకులకూ వీరిద్దరి కామెడీ చూసి చాలా ఏళ్ళు కావడంతో వారికీ మంచి కామెడీ అందబోతోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: