బాలీవుడ్ లో పెద్ద సినిమా ఆఫర్స్ లేకపోయినా.. కెరీర్ లో గట్టి హిట్స్ లేకపోయినా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీస్ లో 'షమ సికందర్' స్పెషల్ బ్యూటి అని చెప్పాలి. ఈ హాట్ బ్యూటి ఏజ్ 38.. అయినప్పటికి పాతికేళ్ల  వయసేమో అనుకునేలా బికిని ఫిజిక్ ని మేయిన్‌టేయిన్ చేస్తోంది. రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చెయ్యడం షమ హాబీ. 

హాబీ అన్న తర్వాత ఒకరోజు చేసి ఊరుకునే రాకాలు ఉండరు కదా. షమ కూడా అలానే తయారైంది. రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక కొత్త ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మనసులోని బాధను నువ్వు పో.. పో అని ఊరికే బ్రతిమాలకుండా.. ఆ బాధే మిమ్మల్ని బ్రతిమాలేలా మీరు స్ట్రాంగ్ గా తయారవ్వాలి.  ఇలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి" అంటూ ఒక వేదాంతం తో కూడుకున్న కొటేషన్ ను క్యాప్షన్ గా పెట్టింది. ఇది షమయిజం... అందరికీ అర్థం అయ్యే బాపతు కాదు. అర్థం అయిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇక ఫోటో విషయానికి వస్తే ఇన్నర్ వేర్ తో పైన బొత్తాలు లేకుండా ఓ తెలుపు రంగు చొక్కా తో హాట్ గా కనిపిస్తొంది. 

అంతేకాదు పెద్ద కుర్చీలో ఒక లేడీ డాన్ లా కూర్చుంది. డార్క్ కలర్ లిప్ స్టిక్ తో యమా హాట్ గా కనిపిస్తూ యూత్ ని టెంప్ట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ పిక్ కావడంతో అందరికి బాగా అట్రాక్ట్ గా అనిపిస్తుంది. ఎవరైనా కాల్విన్ క్లెయిన్ లాంటి బ్రాండ్ వారు కనుక షమను చూస్తే.. షమ ఫ్యూచర్ లో మరో దిశా పటాని ఈ ప్రపంచానికి దక్కడం ఖాయమే.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'బేబీ.. ఇన్స్టాగ్రామ్ లో మంటలు'.. 'విష కన్యలా ఉన్నావు'.. 'హాటెస్ట్ బ్యూటీ'.. '100 కు110 మార్కులు' అంటూ ఒక్కొక్కరు తమ టాగ్స్ తో రఫ్ఫాడిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే షమ నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: