ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాదు జనాలు 'ఛీ' అని చీదరించుకునే పేరు శ్రీ రెడ్డి. ఎప్పుడు వివాదాలు సృష్టిస్తూ వార్తల్లోకి ఎక్కడంలో తనకు తానే సాటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో అడపా దడపా రెండు మూడు సినిమాలు చేసినప్పటికి పాపం తను అనుకున్న స్టార్ హీరోయిన్ రేంజ్ కి రాలేకపోయింది. తనకు కావాల్సిందే స్టార్ స్టేటస్. అందుకే ఎలాగైనా స్టార్ అవ్వాలనుకుందేమోగానీ ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడటం, కనిపించిన ప్రతీ ఒక్కరిని టార్గెట్ చేసి సంచలనం అవుతోంది. తెగించినోడికి తెడ్డే ఫలానా..అన్నట్టు అన్ని విషయాల్లో దిగజారీ మరీ ప్రవర్తిస్తోంది..ఇలాంటివన్ని ప్రస్తుతం శ్రీ రెడ్డి గురించి జనాలు విచ్చలవిడిగా మాట్లాడుకుంటుంది. ఇక తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీస్ కి ప్రముఖు హీరోలపై శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో రెండు సినీ పరిశ్రమలను ఏకిపారేస్తుంది. ఇక మరోసారి ఇదే విషయంలో తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ పై తనకు బాగా అలవాటైన భాషలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి స్టాలిన్‌ను యాక్టర్ విశాల్ రెడ్డి ద్వారా కలిశానని.. అతను గ్రీన్ పార్క్ హోటల్‌లో నన్ను రాత్రంతా అనుభవించాడని... కానీ పనైన తరువాత, ఉదయనిధి స్టాలిన్ నాకు సినిమాల్లో ఎలాంటి పాత్రను ఇవ్వలేదంటు ఎప్పటిలాగే రెచ్చిపోయింది. 

త్వరలో ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి, ఉదయనిధి స్టాలిన్ యొక్క లైంగిక వేధింపుల గురించి మాట్లాడతానంటు బెదిరింపు ప్రవర్తనతో వెల్లడించింది శ్రీ రెడ్డి. ఉదయనిధి స్టాలిన్ తన ప్రొడక్షన్ స్టూడియో రెడ్ జెయింట్ మూవీస్‌తో చిత్ర నిర్మాతగా, పంపిణీదారుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి.. కురువి, ఆధవన్, మన్‌మదన్ అంబుల వంటి సినిమాలు నిర్మించాడు. అంతేకాదు 2012 లో 'ఓరు కల్ ఓరు కన్నడి' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరో నటించాడు. ఇక అప్పటి నుండి తన సొంత సినిమాలలోనే నటించడం..ఆ సినిమాలను తనే నిర్మించడం చేస్తున్నాడు

ఇక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అభిరాం దగ్గుబాటి, విశాల్ రెడ్డి, నేచురల్ స్టార్ నాని, కొరటాల శివ, కోన వెంకట్ సహా మరికొందరు సినిమా అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి నన్ను వాడుకొని వదిలేశారని  ఎప్పటికప్పుడు శ్రీ రెడ్డి వాపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి శ్రీ రెడ్డి కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేసింది. శ్రీ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆరోపణలతో రెచ్చిపోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలా ఎప్పటికప్పుడు నన్ను బలవంత పెట్టారని, వాడుకొని అవకాశాలివ్వకుండా మోసం చేశారని, పక్కలోకి రమ్మన్నారని..రక రకాల పచ్చి బూతులు మాట్లాడుతున్న శ్రీ రెడ్డి మీద నెటిజన్స్ రివర్స్ లో ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు రమ్మన్నారు సరే మీకు బుద్ధి ఉంది కదా..అన్నీ తెలుసు కదా రమ్మనగానే ఎందుకెళ్ళారు అంటూ నెటిజన్స్ కూడా రెచ్చిపోతున్నారు. ఎవరో ఒక డైరెక్టర్ మీకు అవకాశం ఇస్తున్నారు..ఇప్పటి నుంచైనా వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని మీ సత్తా చూపించుకోవచ్చు కదా ఇలా టైం వేస్ట్ చేసుకునే బదులు అంటు సలహాలిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: