సెలబ్రిటీల ను కలవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు అతి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇలాంటి అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది కూడా పడుతుంటారు. ఇదిలా ఉండగా బుళ్ళుతెరపై తన  సత్తాచాటి ఆత ర్వాత వెండితెరపైకి మెరుస్తున్న నటి  మౌని రాయ్. వరుస సినిమాలతో దూసుకుపోతూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటుంది  ఈ నటి.ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోవింగ్ కూడా గట్టిగానే ఉందీ.  ఒకప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ నటి ఇప్పుడు వెండితెరపై కూడా ప్రేక్షకులని  అలరిస్తుంది. అయితే మౌనీ రాయ్ కథానాయకిగా  నటించిన చిత్రం మేడ్ ఇన్ చైనా. ఈ సినిమా తాజాగా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతున్నది . అయితే ఈ మేడ్ ఇన్ చైనా సినిమాలో  రాజ్ కుమార్ రావ్  హీరోగా నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రాజకుమార్ రావు... హీరోయిన్ మౌని రాయ్ లు  ఓ  మీడియా ఛానల్ ఇంటర్వ్యూ నిమిత్తం ఆ చానల్ ఆఫీస్ కి వెళ్ళారూ. 

 

 

 

 అయితే మీడియా ఆఫీసుకు వెళ్లిన  వారిద్దరిని ఒక రూమ్ లో కూర్చోబెట్టారు. కాగా  రాజ్ కుమార్ రావు  మౌనీ రాయ్ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వారు గది తలుపులు ధడేల్  మంటూ తలుపులు తెరుచుకుని  రాజ్ కుమార్,  మౌని రాయ్ ఉన్న రూమ్ లోకి వచ్చాడు. చేతిలో బొకే  పట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి నేను మీ అభిమానిని అంటూ మౌనీ రాయ్ కి తెలిపాడు . ఇంతలో చేతిలో ఉన్న బొకే మౌని రాయ్ కి అందజేస్తూ ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేశారు.దీంతో  తెగ టెన్షన్ పడిపోయింది. అతను అలా ప్రపోజ్ చేయడంతో తెగ కంగారు పడిపోయింది మాని రాయ్ . ఆ తర్వాత మౌని రాయ్ తన ప్రపోజల్ కి ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో బొకేను  ను నేలకేసి కొట్టి సీరియస్ గా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి...  ఇంతలో అతని అడ్డుకునేందుకు వచ్చిన హీరో రాజ్ కుమార్ కూడా పక్కన నెట్టేసాడు ఆ అభిమాని. 

 

 

 

 దీంతో మౌనీ రాయ్ మరింత భయపడిపోయింది.మౌని రాయ్ కీ చెమటలు పట్టేసాయి.  వెంటనే బాడీ గార్డులను  పిలిచింది మౌని రాయ్ . అప్పుడు గదిలోకి అభిమాని అంటూ వచ్చిన వ్యక్తి.. హీరో రాజ్ కుమార్  ఒక్కసారిగా నవ్వి  ఇది ప్రాంక్ అంటూ చెప్పేసారు. దీంతో మౌని రాయ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎంతో భయపడిన మౌని రాయ్... హీరో రాజ్ కుమార్ ని  తిట్టిపోసారు. ఇలాంటి ఫాన్స్ ఇంకెప్పుడు చేయొద్దు అంటూ  చెప్తారు. ఈ వీడియోను ఆ ప్రాంక్ స్టార్ యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో తెగ  వైరల్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: