ఓ స్టార్ హీరోయిన్ కు మెగా హీరో ఫ్లాప్ ఇవ్వడంతో.. ఆ అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. ఇప్పుడీ స్టార్ ను మరో మెగా హీరో ఆదుకుంటున్నాడు. ఓ మెగా యంగ్ హీరో సినిమాలో ఈ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది. 


బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ భరత్ అనే నేనుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. వినయ విధేయ రామలో రామ్ చరణ్ తో జతకట్టే ఛాన్స్ అందుకుంది కియారా. ఇంకేముందీ టాలీవుడ్ ను దున్నేయచ్చన్న ఆమె ఆశపై వినయ విధేయ రామతో ఫుల్ స్టాప్ పడింది. ఆ సినిమా రిలీజై ఏడాది కావొస్తున్నా.. ఇంతవరకు తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. 


కియారా అద్వానీకి రామ్ చరణ్ ఫ్లాప్ ఇస్తే.. మరో మెగా హీరో వరుణ్ తేజ్ ఛాన్స్ ఇస్తున్నాడు. గద్దలకొండ గణేశ్ తర్వాత నటించే సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రైనర్ ఆధ్వర్యంలో బాక్సింగ్ నేర్చుకునే పనిలో ఉన్నాడు. స్పోర్ట్స్ పర్సన్ కావడంతో.. మరోవైపు వెయిట్ తగ్గుతున్నాడు వరుణ్. 


వరుణ్ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకుంటున్నారట. ఆల్ రెడీ సంప్రదింపులు జరిపారని టాక్. కార్తీక్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు వెంకటేశ్ మరో నిర్మాత సిద్దు ముద్దా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి వరుణ్ తేజ్.. ఈ అమ్మడికి ఎలాంటి అవకాశాలు వచ్చేలా చేస్తాడో చూడాలి. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. కియారాకు ఆఫర్ల వర్షం కురుస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వరుణ్ మూవీతోనే కియారా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. చిత్ర సంగీతం, డ్యాన్స్ లు... స్టోరీ కంటెంట్ బాగుంటే కియారాకు ఇక తిరుగుండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: