టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజే వేరు. మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మహేష్ బాబుకి పోకిరి సినిమాతో సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఏర్పడింది. అంతకుముందు వరకు మహేష్ బాబుని ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచేవారు...ఎప్పుడైతే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమా చేశాడో అప్పుడే ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను మొత్తం పగలగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది కొత్త ట్రెండ్ సృష్టించారు.


ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్న క్రమంలో ఈ సినిమా టీజర్ కి సంబంధించి డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అని లేకుండా ట్వీట్ వేసిన దర్శకుడికి మహేష్ బాబు కాల్ చేసి సూపర్ స్టార్ ట్యాగ్ పెట్టమని అడిగారట. అయితే పెట్టిన ట్వీట్ డిలేట్ చేసి మరొక ట్వీట్ చేసారు అనిల్.


అయితే మహేష్ బాబు ఇలా అడగడం పట్ల ప్రేక్షకులు సెటైర్లు వస్తున్నారు. ఇలా కూడా వుంటారా? అని ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు సైలెంట్ గా ఉండే మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్ గా ఎక్కువగా ఆర్భాటాలకు కూడా వెళ్లకుండా ఉన్న మహేష్ బాబు ఒక్కసారిగా డైరెక్టర్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ పెట్టక పోవటం పై అడిగి పట్టించుకోవడం చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఇది మహేష్ బాబు ఎప్పుడు ఎవ్వరు చూడని కోణం అని సెటైర్లు వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: