ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం 'అమ్మ‌దీవెన‌'. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 16న శ‌నివారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో  మేయ‌ర్  బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో...


మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఒక మంచి శుభ సంద‌ర్భంలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు చిన్న మారయ్య గుర‌వ‌య్య ప్రొడ్యూసర్స్ గా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో  ఈ చిత్రం వ‌స్తుంది. ఎటువంటి దీవెన అయినా త‌క్కువ‌వ్వొచ్చు కాని 'అమ్మ‌దీవెన' ఎక్క‌డా తక్కువ‌కాదు. ఈ చిత్రంలో అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఆమ‌నిగారికి అభినంద‌న‌లు తెలియజేస్తున్నా" అన్నారు.


ప్రముఖ నిర్మాత డి.ఎస్‌రావు  మాట్లాడుతూ... తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న. ఆమని గారు  ఈ చిత్రంలో  న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను.   ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా పేరు వింటుంటే మాతృదేవోభ‌వ‌ సినిమా గుర్తుకువ‌స్తుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయి ప్రొడ్యూస‌ర్లు ఇంకా మ‌రెన్నో చిత్రాలు తియ్యాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు. 


శ్రీ‌దేవి బొంతు మాట్లాడుతూ... ఈ రోజు నిజంగా అమ్మ‌దీవెన లాంటి  మంచి చిత్రాన్ని  నిర్మించిన  ప్రొడ్యూస‌ర్లు డైరెక్ట‌ర్ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా చాలా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవ్వాలని కోరుకుంటున్నా.  అమ్మ‌గారి పేరు మీద ప్రొడ్యూస‌ర్లు ఈ సినిమా తీశారు. పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. సిసింద్రీ నాకు ఫేవరేట్ సినిమా.  ఆ సినిమాలో ఆమని గారు చాలా బాగా న‌టించారు. త‌ల్లి దీవెన‌లు ఉంటే మ‌నం ఎల్ల‌వేళ‌లా పై చేయి సాధిస్తాము" అన్నారు. 


నటి ఆమ‌ని మాట్లాడుతూ... నేను ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఒక  త‌ల్లిగా ఎంత రెస్పాన్సిబుల్  గా ఉండాలి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాము. ఒక తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస‌ర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమ‌ని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. శివ‌ గారుఈ సినిమా చెప్పిన‌ప్పుడు అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని స‌న్నివేశాలు చాలా  నాచ‌ర‌ల్‌గా తీశారు. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలోనే  డీ గ్లామ‌ర్ పాత్రలో   న‌టించాను. మంచి  కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. మాటలు, స్లాంగ్ అన్నీ బాగా కుదిరాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ ప‌ల్ల‌వి చాలా బాగా న‌టించారు. పోసానిగారి పాత్ర ఈ సినిమాలోచాలా యాప్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పుట్టిన‌రోజు నాడు పోస్ట‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది' అన్నారు. 


ద‌ర్శ‌కుడు  శివ ఏటూరి మాట్లాడుతూ... నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌గారికి  ఎప్పటికీ రుణపడి ఉంటాను.  ఇది చాలా మంచి మూవీ ఈ నెల ఆఖ‌రు లోపు ఆడియో  విడుద‌ల కాబోతుంది త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం" అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: