స్టార్ హీరోయిన్, పైగా అందాల తార. ఇక అభినయం సూపర్ ఆమె కొన్ని పాత్రలు చేయాలే కానీ ఎవరూ రీప్లేస్ చేయలేరు అంటారు. పైగా ఆమె అంటే నిన్న మొన్నటి దాకా మోజు కూడాను. ఆమె కాల్షీట్ల కోసం క్యూ కట్టిన వారిలో అగ్ర నిర్మాతలు, టాప్ హీరోలు ఉన్నారు. ఆమె తమ పక్కన నటించాలని కోరుకున్నారు  కూడా.  మరి అంతటి వారంతా ఇపుడు ఎందుకు సైడ్ చేస్తున్నారు అంటే చాలా రీజన్లే ఉన్నాయట.


ఇంతకీ ఆమె ఎవరో కాదు నయనతార. నయన్ అంటే ఒకపుడు టాలీవుడ్ మొత్తం వెంటపడింది. ఓ వెటరన్ హీరో అయితే ఆమెను తన సినిమాలో పెట్టమని వత్తిడి కూడా తెచ్చాడు. తీరా ఆమె డిమాండ్లు అన్నీ ఒప్పుకుని మూవీలో పెట్టుకున్నాక ఆ వెటరన్ హీరోకు ఆమె చుక్కలు చూపించిందట. దాంతో ఈ ఇద్దరి మధ్య తీయాలనుకున్న డ్యూయెట్ ని కూడా క్యాన్సిల్ చేసి  మరీ సినిమాను రిలీజ్ చేశారు.


ఇక మరో సీనియర్ హీరో సినిమాను ఒప్పుకుంది కానీ టచ్ మీ నాట్ అంటూ కొత్త షరతులు పెట్టింది. దాంతో ఆ హీరో గారికి అంతకు ముందు నయన్ తో హిట్లు ఉన్నా కూడా ఇక చాలు అనేసుకున్నారట. ఇక రీసెంట్ గా ఆమె మరో సీనియర్ హీరోతో నటించింది. కనీసం ఆమె ప్రమోషన్ కి కూడా రాలేదు. దాంతో ఆ చిత్ర యూనిట్ ఎంతో అప్సెట్ అయ్యారట.


దీంతో ఇపుడు నయన్ అంటే టాలీవుడ్ భయపడుతోంది. పైగా ఆమె డిమాండ్ కి తగిన మార్కెట్ కూడా తమిళనాడులో ఇపుడు లేదని కూడా అంచనా వేసుకుంటున్నారుట. అందువల్ల ఆమెను తీసుకోవడం వల్ల షరతులు ఒప్పుకుని సినిమా బడ్జెట్ పెంచుకోవడం ఎందుకన్న ఆలోచనలో పడ్డారట. ఇక చూడబోతే నయన్ కెరీర్ కూడా ఇపుడు డౌన్లో ఉంది. తమిళ్ లో సినిమాలు కూడా వరసగా ఫల్టీలు కొడుతున్నాయి. దాంతో ఆమె తొందరలో పెళ్ళి చేసుకుంటుందని కూడా ప్రచారం మొదలైంది. మొత్తానికి టాలీవుడ్ ని నయన్ మోజు పోయినట్లేనా.


మరింత సమాచారం తెలుసుకోండి: