అల్లు అర్జున్ సుకుమార్మూవీ వచ్చేనెల షూటింగ్ ను ప్రారంభించబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ మూవీ కథను దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో తీయబోతున్నారు. ఈ కథకు ఇప్పటికే అనేక మార్పులు చేర్పులు చేసిన తరువాత తయారైన ఈ ఫైనల్ స్క్రిప్ట్ చూసుకున్న తరువాత సుకుమార్ బన్నీలకు ఒక ఊహించని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. 

సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మూవీలోని బన్నీ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా ‘ఖైదీ’ సినిమాలోని కార్తి లుక్ ఎలా ఉంటుందో అలా మారడంతో ఇప్పుడు మళ్ళీ బన్నీ లుక్ కు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ కథ వెనుక కూడ ‘ఖైదీ’ మూవీ కథలాగే ఒక రివెంజ్ ఫార్మలా ఉంటుందని అంటున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు ఈ సినిమాకు హీరో రామ్ షాక్ తగలడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి బన్నీ సుకుమార్ ల మూవీకి ‘రెడ్’ అన్న టైటిల్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలు చేసి ఈ టైటిల్ గురించి సుకుమార్ తనకు తెలిసిన కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను అడగడం మొదలు పెట్టాడట. 

ఈ లీకులు రామ్ వరకు వెళ్ళడంతో ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తరువాత రామ్ అనేక ఆలోచనలు చేసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సుకుమార్ కంటే ముందుగా ‘రెడ్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసి ఏకంగా అనౌన్స్ మెంట్ కూడ చేసాడు. దీనితో షాక్ అయిన సుకుమార్ ఇప్పుడు తన లేటెస్ట్ మూవీకి మరొక కొత్త టైటిల్ వెతికే పనిలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో బన్నీ సుకుమార్మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే లుక్ పరంగా కార్తితో సమస్యలు టైటిల్ పరంగా హీరో రామ్ తో సమస్యలు రావడం యాధృశ్చికం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: