సమాజంలో నీతులు చెబితే ఎవరు వినరు. అలాగే మంచి ఫ్యామిలీ సినిమాలు వస్తే అవి ఆడవు.  అదే అడల్ట్ కంటెంట్‌తో ఉన్న సినిమాల ముందు ప్రేక్షకులు వెర్రి వాళ్లలా క్యూలు కడతారు. ఇలాంటి సినిమాలకు కొద్దిరోజుల్లో చచ్చే ముసలాడి నుండి మూతీ మీద కనీసం మీసం కూడ మొలవని కుర్రాళ్లూ వస్తున్నారు.


దీని బట్టి అర్ధం అవుతుంది ఏంటంటే బూతు అనేది ఓ ఆయస్కాంతంలా,  మంచి అనేది బుర్రకధలా నేడు మారింది అని అనుకోవలసిన ఖర్మ పట్టింది...  నేటి తరానికి... ఇకపోతే సినిమాల్లో శృంగార స‌న్నివేశాలు వస్తుంటే సొళ్లు కార్చుకుంటూ ఆస‌క్తిగా గ‌మ‌నించే ప్రేక్ష‌కుల శాతం ఎక్కువ‌గానే ఉంటుంది.  అయితే నలుగురిలో కట్టుకున్న పెళ్లాం నడుము పట్టుకోవాలంటెనే తెగ సిగ్గుపడిపోతాం అలాంటిది అంతమంది ముందు ఇలాంటి స‌న్నివేశాల‌ను ఎలా చిత్రీక‌రిస్తారు అని అందరికి కుతుహలం ఉంటుంది.


సెట్‌లో వంద మంది ఉంటారు. అంత మంది ముందు సాధార‌ణ స‌న్నివేశాల్లో న‌టించ‌డం వ‌ర‌కు ఓకే. మ‌రి శృంగార స‌న్నివేశాల‌ను అంత మంది ముందు ఎలా చిత్రీక‌రిస్తారన్న  ప్ర‌శ్న‌ "టుంబ్ రైడ‌ర్‌"  హీరోయిన్  "అలిసియా వికేంద‌ర్‌" ను అడగ్గా.. ఆమె ఏమాత్రం త‌డుముకోకుండా త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చింది.


శృంగార స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు ప‌రిమిత సంఖ్య‌లోనే యూనిట్ స‌భ్యులు ఉండాల‌ని, సింగిల్ టేక్‌లోనే స‌న్నివేశాన్ని షూట్ చేసేయాల‌ని ఆమె ముందుగానే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కండీష‌న్ పెడుతుంద‌ట‌. అందుకు ఒప్పుకుంటేనే తాను ఇన్టిమేట్ సీన్స్‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంటాన‌ని చెప్పిందీ అమ్మ‌డు.


ఇక 20 ఏళ్లప్పుడే శృంగార సన్నివేశంలో న‌టించాన‌ని, త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన శృంగార సన్నివేశాలు సాంకేతిక‌మైన‌వే త‌ప్ప‌.. మ‌రేమీ కావ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొంది అలిసియా. 


మరింత సమాచారం తెలుసుకోండి: