జానపదం సినిమాల్లో కత్తియుద్దం అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు కాంతారావు.  కత్తి కాంతారావు అని ఆయనకు పేరు ఉన్నది.  సినిమా రంగంలో అయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.  ఎంత ఎత్తుకు ఎదిగారో.. అదే కళను నమ్ముకొని డబ్బులు ఖర్చు చేసి దారుణంగా దెబ్బతిన్నాడు.  ఉన్న ఇల్లు, ఆస్తులు అమ్మేసుకోని రోడ్డున పడ్డారు.  ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి.. రోడ్డున పడటం అంటే మాములు విషయం కాదు.  


అప్పట్లో తెలుగులో జానపద సినిమాలు ఎక్కువుగా వచ్చేవి.  ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ముఖ్యంగా జానపదబ్రహ్మగా పేరు తెచ్చుకున్న విఠలాచార్య సినిమాల్లో కాంతారావు ఎక్కువగా నటించేవారు.జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైమ్ ఇలా ఎన్నో జానర్లలో కాంతారావు నటించి మెప్పించారు.  ఇలా మెప్పించిన కాంతారావు నారద పాత్రల్లో కూడా అద్భుతంగా నటించారు.  కత్తి కాంతారావు నారదుడి పాత్ర గురించి ఎన్టీఆర్ కొన్ని కామెంట్లు కూడా చేశారు.  


రాముడు, భీముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి ఎన్నో బహుముఖ పాత్రల్లో నటించిన తనకు నారద పాత్ర అంటే ఎంతో ఇష్టం అని, కానీ, ఆ నారద పాత్రలో కాంతారావు ఆరితేరిపోయారని, ఆ పాత్ర ఆయనకే సొంతం అని, ఎప్పుడూ కూడా ఆ పాత్రలో నటించనని ఎన్టీఆర్ చెప్పడం విశేషం.  ఎన్టీఆర్ చెప్పినట్టుగానే నారద పాత్రలో ఒక్క సినిమా కూడా చేయలేదు.  ఇచ్చిన మాటకు ఎన్టీఆర్ కట్టుబడి ఉన్నారు.  


ఇక ఇదిలా ఉంటె, నటుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చుకొని సినిమా రంగంలో లక్షలు సంపాదించిన కాంతారావు, హైమా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి 1969లో సప్తస్వరాలు సినిమా తీశారు.  ఈ సినిమా నిర్మాణం కోసం అప్పట్లో ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.  అప్పుడే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో సినిమా ఫెయిల్ అయ్యింది.  ఆ తరువాత కాంతారావు తీసిన గండర గండడు సినిమా తీశాడు.  ఈ సినిమా మంచి హిట్ అయ్యినా.. సప్తస్వరాలు సినిమా మిగిల్చిన నష్ఠాలను పూడ్చలేకపోయింది.  ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణతో ప్రేమజీవులు సినిమా చేశారు.  అయితే, ఈ సినిమా తీయ్యొద్దని, నష్టాలు వస్తాయని గుమ్మడి ఎంత చెప్పినా కాంతారావు వినలేదు.  ఈ సినిమాతో అయన అప్పులు రెట్టింపు అయ్యాయి.  దీంతో కాంతారావు రోడ్డున పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: