దేశంలో పేరెన్నికగన్న నేత బీజేపీ నేత రాజకీయాలను క్రికెట్ మ్యాచ్ తో పోల్చారు.  రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. మహారాష్ట్రలో అధికారం చేపట్టేది బీజేపీనే అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ తెలియడం లేదు.  ఆ వెంటనే బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా బీజేపీ ప్రకటించడంతో శివసేన పార్టీ షాక్ అయ్యింది.  ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. 


సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.  సినిమా రంగంలో రాణించిన వ్యక్తులు, రాణిస్తున్న వ్యక్తులు రాజకీయాలోకి రావాలని చూస్తుంటారు.  రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టాలని చూస్తుంటారు.  తెలుగు రాజకీయాల కంటే, తమిళ రాజకీయాల్లోనే సినీ తారలు ఎక్కువుగా ఉంటారు.  ఎంజీఆర్, జయలలితలుసినిమా ఇండస్ట్రీనుంచి వచ్చిన వ్యక్తులే.  వీరే కాదు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు.  


అందరు రాణిస్తారు అని చెప్పడానికి అవకాశం లేదు.  ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోకి మరో సంచలన తార అడుగుపెట్టబోతున్నది.  ఆమె ఎవరో కాదు.. తెలుగు సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించి.. మహిళలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి నినదించి.. ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా కూర్చున్న నటి శ్రీరెడ్డి.  ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో తమిళనాడుకు వెళ్ళింది.  అక్కడ సినిమాలు చేస్తున్నది. 


సినిమాలు చేస్తున్నా ఆమె విమర్శలు మాత్రం ఆగడం లేదు.  తమిళనాడులో ఆమె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేస్తూ పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  దీనిపై విమర్శలు రావడంతో శ్రీరెడ్డి నిన్నటి రోజున చెన్నైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. పేస్ బుక్ లో తాను పోస్ట్ చేయలేదని, అది ఫేక్ అకౌంట్ అని చెప్పి చేతులు దులుపుకుంది.  అంతేకాదు, డీఎంకే పార్టీ గురించి శ్రీరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసింది.  కరుణానిధి కుటుంబంపై తనకు అభిమానం ఉందని, ఉదయనిధి స్టాలిన్ ను ఇప్పటి వరకు కలవలేదని చెప్పింది.  త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించింది.  ఏ పార్టీ తరపున ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నదో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది.  కరుణానిధి కుటుంబంపై గౌరవం ఉందని చెప్పడం వెనుక ఆ పార్టీలో జాయిన్ అయ్యి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: