కంగనా రౌనత్ బాలీవుడ్ హాట్ బ్యూటీ. ఆమెతో నటించాలని చాలామందికి  ఉంటుంది. కానీ కుదరదు కదా. ఇక కంగనా బోల్డ్ టైప్ యాక్ట్రస్ అని  అంటారు. ఆమె హిందీలో నటనకు మంచి అవార్డులు ఎన్నో అందుకుంది టాలెంట్ కి టాప్ ర్యాంకర్ గా ఉన్న కంగానా మంచి పాత్రలనే ఎక్కువగా చేసింది. అలాగే ఎనో గొప్ప  పాత్రలు ఆమె కెరీర్లో ఎన్నో ఉన్నాయి.


ఇక కంగనా రౌనత్ ఇపుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. దీనికి జయ పేరు పెట్టి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నరు. ఈ చిత్రంలో జయలలిత సినిమా జీవితంలో ఆమెతో పాటు నటించిన నందమూరి అందగాడు పాత్ర ఉంది. దానిని ఆయన కుమారుడు బాలక్రిష్ణ చేత చేయించాలని అనుకుంటున్నారుట.


జయలలిత సినీ కెరీర్లో బాద్గాద్ గజదొంగ, ఆలీ బాబా నలభై దొంగలు, కదలడు వదలడు, కధానాయకుడు దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో అన్న గారికి జంటగా కనిపించింది మరి జయ బయోపిక్ లో ఆమె సినీ జీవితాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ గా తీస్తున్నారుట. మరి అన్న గారితో జయ సినీ రొమాన్స్ ని పండించేందుకు ఆయన తనయుడు బాలయ్యను అడుగుతున్నారట చిత్ర యూనిట్.


బాలయ్య ఓకే కనుక చెబితే కంగనా రౌనత్ తో కలసి రొమాన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరూ ఒక సందర్భంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా  పనిచేశారు. కాబట్టి సినీ రాజకీయ విశేషాలు కూడా ఈ బయోపిక్ లో ఎక్కువగా ఉంటాయట. మరి బాలయ్య యెస్ అంటే కంగనా తో రొమాన్స్ కుదిరినట్లే. చూడాలి ఈ ముచ్చట ఎలా ఉంటుందో. ఎందుకంటే తండ్రి పాత్రలను పండిచండంలో బాలయ్యకు సాటి ఎవరూ లేరు కదా.




మరింత సమాచారం తెలుసుకోండి: