బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్స్ గా ఉన్న వరుణ్ తేజ్, వితిక, రాహుల్, పునర్నవిల గ్యాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. సీజన్ 3 విన్నర్ గా రాహుల్ ఇప్పటికే సూపర్ క్రేజ్ తెచ్చుకోగా టాప్ 4గా నిలిచిన వరుణ్ సందేష్ కూడా మునుపటి ఇమేజ్ ను తిరిగి తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.


ముఖ్యంగా వరుణ్, వితికల రియల్ జోడీ బిగ్ బాస్ షోకి వెళ్లడం వారి మధ్య బాండింగ్ తో ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేశారు. వరుణ్ లాంటి భర్త ప్రతి అమ్మాయికి రావాలని కోరుకునేలా అతని ప్రవర్తన ఉంది. ఇక వితిక కూడా గడుసు అమ్మాయిగా తన మార్క్ చూపించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 రెబల్ స్టార్ గా కనిపించిన పునర్నవికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది.


ఉయ్యాల జంపాల సినిమాలో సైడ్ రోల్ చేసిన పునర్నవి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. బిగ్ బాస్ షో పూర్తయినా సరే ఈ నలుగురు గ్యాంగ్ మాత్రం ఇంకా బిగ్ బాస్ మేనియా కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ గా యాంకర్ రవి సొంత యూట్యూబ్ ఛానెల్ లో రాహుల్, వరుణ్, వితిక, పునర్నవిలు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.


అంతేకాదు వరుణ్, వితికలకు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రాహుల్, పునర్నవిలు జోడీగా కూడా సినిమా ప్లానింగ్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 3 లో క్రేజీ లవ్ కపుల్స్ గా రాహుల్, పునర్నవిల జంట ప్రేక్షకులను అలరించింది. 3 సీజన్ల బిగ్ బాస్ షోలో ఈ సీజన్ లో ఈ నలుగురికి మాత్రం మంచి క్రేజ్ వచ్చి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నట్టుగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: