మన సొసైటీలో ఎక్కువమందికి ఎవరైనా లవ్ చేసుకుంటున్నారని తెలిస్తే చాలు..మనకు ఎంత సభ్యత సంస్కారం ఉన్నా అన్నీ తీసి పక్కన పెట్టేసి వాళ్ళ గురించి వివరాలు కనుక్కునేందుకు అతి ఉత్సాహం చూపిస్తుంటాము. ఇక ఆ లవర్స్ కనుక సెలబ్రిటీలు అయితే వాళ్ళ మీద ఆ ఆసక్తి డబుల్ అవుతుంది. అందుకే నయనతార-విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ సౌత్ మొత్తం బాగా ఫేమస్ అయింది. 

లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. నయన్ - విఘ్నేశ్ శివన్ అసలు లవర్స్ కాదని.. ఇద్దరికీ ఎప్పుడో రహస్యంగా పెళ్ళి కూడా అయిపోయిందని.. వారిద్దరూ భార్యాభర్తలని.. కొందరు కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అయినా ఈ  జంట తమ స్టేటస్ గురించి అధికారికంగా ఎప్పుడు రియాక్ట్ అయింది లేదు. అయితే ఇద్దరూ ఫారెన్ వెకేషన్స్ కు వెళ్లిన సమయంలో మాత్రం ఏదో ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. నయన్ సోషల్ మీడియాకు ఒక బిలియన్ మైల్స్ దూరంగా ఉంటుంది. కానీ విఘ్నేశ్ మాత్రం ఈ సోషల్ మీడియాలోఎ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. అందుకే విఘ్నేశ్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాడు.  

ప్రస్తుతం నయన్- విఘ్నేశ్ జంట న్యూయార్క్ హాలిడేలో ఉన్నారు. నవంబర్ 18 న నయనతార పుట్టినరోజు. అందుకే బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమే ఈ ప్రేమ పావురాలు న్యూయార్క్ వెళ్ళారని అనుకుంటున్నారు. విఘ్నేశ్ ఈ ఫోటోను పోస్ట్ చేసి "ఈ ఆకాశం & ఆమె చిరునవ్వు.. అలౌకికం. తన పుట్టినరోజు రాబోతోంది. ఈ నగరం చాలా చాలా అందమైనది. ఇక్కడ వణికించే చలి ఉంది. #న్యూయార్క్ సిటీ #బ్రూక్లిన్ బ్రిడ్జ్ #నయనతార #లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోకు కామెంట్లలో ఎక్కువమంది నయన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరు మాత్రం ఈ ప్రేమ పావురాలు అందనంత ఎత్తులో ఎగురుతూ కూడా ఎరగనట్టు ఉంటున్నారని కోలీవుడ్ మీడియా జనాలు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: