టాలీవుడ్ హీరో వెంకటేష్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే కుటుంబ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. మంచి ఇమేజ్ ఉన్న  హీరోగానే  కాకుండా వైవిధ్యమైన పాత్రలను కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వెంకటేష్ . ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు ఆయన. ఇక టాలీవుడ్ హీరోల అందరి లో సెంటిమెంట్ బాగా పందించగల  హీరో వెంకటేష్ మాత్రమే అని అభిమానులు భావిస్తున్నారు. అయితే సీనియర్ హీరో అయినప్పటికీ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు హీరో వెంకటేష్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి  మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకున్నారు ఆయన. సీనియర్ హీరో అయినప్పటికీ హీరోయిన్ డామినేషన్ ఉండే పాత్రల్లో  నటించారు వెంకటేష్. ఇలాంటి సినిమానే  ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 



 అయితే ఈ సినిమాకు సంబంధించి నటుడు  శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఈ  సినిమాలో  నటుడు శ్రీరామ్ వెంకటేష్ ని చెంపదెబ్బ కొట్టే  సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ వెంకటేష్ ను  నిజంగానే వెంకటేష్ చెంప మీద కొట్టమని చెప్పాడు అని చెప్పారు. అయితే వెంకటేష్ చెంపమీద కొట్టేందుకు తాను అభ్యంతరం చెప్పానని  శ్రీరామ్ చెప్పాడు. సినిమా అంటే ఏదైనా నటన ద్వారానే చెప్పాలని అంతే తప్ప ఇలా కొట్టడం ఏంటంటూ డైరెక్టర్ అని ప్రశ్నించాడట శ్రీరామ్. కానీ దర్శకుడు చెప్పిన విషయానికి వెంకటేష్ కూడా ఓకే చెప్పడంతో నిజంగానే చెంప దెబ్బ కొట్టాలని వెంకటేష్ తనతో స్వయంగా చెప్పారని శ్రీరామ్ తెలిపారు. దీంతో ఆ చెంప దెబ్బ కొట్టే  షూటింగ్ చిత్రీకరణ సమయంలో నిజంగానే వెంకటేష్ చెంప మీద కొట్టాను  అని తెలిపారు శ్రీరామ్.  ఈ షాట్ ఓకే అయ్యేందుకు  దాదాపు నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టినట్లు శ్రీరామ్ చెప్పారు. 



 వెంకటేష్ కు సీనియర్ హీరో అన్న ఇగో  కొంచెం కూడా లేదంటూ శ్రీరామ్ తెలిపారు. ఏదైనా సినిమా ఓకే చేశారంటే దాంట్లో ఎంతో నిబద్ధతతో వెంకటేష్ పనిచేస్తారని శ్రీరామ్ అన్నారు. ఇదిలా ఉండగా  ఈ ఏడాది మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి  మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు తన సొంత మేనల్లుడు నాగచైతన్యతో  వెంకి మామ అనే సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ఏ  చిన్న విషయంలో బయటకి వచ్చిన  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: