సూపర్ స్టార్ మహేష్ మరియు రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు, అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ ప్రేక్షకులను మరియు మహేష్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

ఇకపోతే ఇటీవల రెండు రోజుల క్రితం ఈ సినిమా అఫీషియల్ టీజర్ కు సంబంధించి సినిమా యూనిట్ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. టీజర్ లోడింగ్ అంటూ, మహేష్ ఆర్మీ మేజర్ గెటప్ లో గన్ పట్టుకుని వస్తున్న ఒక సీన్ ని కూడా యూనిట్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది. ఇక ఈ టీజర్ ను ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. ఇకపోతే నేడు ఈ టీజర్ లో హైలైట్స్ ఇవేనంటూ ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. దానిని బట్టి, టీజర్ లో కామెడీ మరియు యాక్షన్ సీన్స్ కలిసి ఉంటాయట. మహేష్ బాబు తనలోని కామెడీ యాంగిల్ ని ఈ టీజర్ లోని రెండు డైలాగ్స్ తో మరొక్కసారి అదరగొట్టబోతున్నారని, 

అలానే సినిమాలో కీలకంగా ఉండే రెండు యాక్షన్ సీన్స్ కూడా టీజర్ లో ఉండబోతున్నట్లు చెప్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ తరువాత తప్పకుండా సినిమాపై అంచనాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా సరిలేరు నీకెవ్వరు టీజర్ ఈ విధంగానే కనుక ఉంటె, ఇక సినిమా తప్పకుండా హిట్ అయినట్లే అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: