2017 సంవత్సరంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. తొలిసారి జూనియర్ ఎన్టీయార్ జై లవకుశ సినిమాలో మూడు పాత్రలలో నటించాడు. జూనియర్ ఎన్టీయార్ సోదరుడైన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. రాశిఖన్నా, నివేదాథామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని ఒక పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన జై లవకుశ సినిమాలోని " నీ కళ్లలోన కాటుక ఓ నల్లమబ్బుకాగా " అనే పాట యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. ఈ పాటకు ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. రెండు షేడ్స్ లో సాగే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ఎన్టీయార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అయినా యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికీ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ ఉండటం గమనార్హం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. 2020 సంవత్సరం జులై నెల 30వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ ఇప్పటికే ఫైనల్ కాగా జూనియర్ ఎన్టీయార్ హీరోయిన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
డిసెంటర్ 31వ తేదీన లేదా 2020 జనవరి నెల 1వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్, జూనియర్ ఎన్టీయార్ ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకే కాలానికి చెందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం స్వాతంత్రం కోసం చరిత్ర ప్రకారం వేరువేరుగా పోరాటం చేసినా వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కల్పితమైన కథతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: