శ్రీరెడ్డి.. ఈపేరు ఎన్నో వివాదాలకు తెరతీసిన పేరు.  టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని, ఇప్పుడు హీరోయిన్లుగా చలామణి అవుతున్న వ్యక్తులు క్యాస్టింగ్ కౌచ్ కు గురికాకుండా ఎదిగిన వాళ్ళు లేరని చెప్పడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి వివాదాలు రేపిన శ్రీ రెడ్డి ఆ తరువాత అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చొని కొంత వివాదం రేపింది.  ప్రస్తుతం తమిళనాడు వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటోంది.  


ఇక ఇండస్ట్రీలో మరో వివాదాస్పదమైన వ్యక్తి కత్తి మహేష్.  రివ్యూ రైటర్.  వివాదాస్పదంగా రివ్యూలు చేస్తుంటాడు.  వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మహేష్, డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తుంటాడని పేరు ఉన్నది.  అయితే, బిగ్ బాస్ షోతో ఈ మహేష్ వెలుగులోకి వచ్చాడు.  అలా వెలుగులోకి వచ్చిన తరువాత ఆగడం ఎక్కువైంది.  ఏకంగా పవన్ కళ్యాణ్ గురించి వివాదాస్పదంగా మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ చేత చివాట్లు తింటుంటాడు.  


అయితే, వివాదాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు.  శ్రీరెడ్డి యాంకర్ అవతారంలో కత్తి మహేష్ ను ఇంటర్వ్యూ చేసింది.  బోల్డ్ గా మాట్లాడే ఈ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అంటే ఇక చెప్పాల్సింది ఏమున్నది.  ఆ ఇంటర్వ్యూ ఎంత హాట్ హాట్ గా ఉంటుందో.  అయితే, వీరి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగాయి.  దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవలే రిలీజ్ చేశారు.  


మీరు డబ్బులు తీసుకొని రివ్యూలు రాస్తున్నారా? మీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ఏంటి ? మీరు వర్జినిటీ ఎప్పుడు పోగొట్టుకున్నారు ? మీరు నన్ను ప్రేమిస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగింది.  ప్రేమించడం లేదు అని ఎవరు చెప్పారు.  మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని కత్తి మహేష్ చెప్పడం విశేషం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారని కత్తి మహేష్ చెప్పి మరింత వివాదాన్ని సృష్టించాడు.  పవన్ కళ్యాణ్ కు చాల మానసిక సమస్యలు ఉన్నాయని, అందులో ఒకటి చీరకట్టుకొని డ్యాన్స్ చేయడం అని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.  ఇలా ఎన్నో హాట్ హాట్ వివాదాస్పదంగా ఉండే విషయాలను ఈ ఇంటర్వ్యూ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: