మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నా..రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో డిజాస్టర్ టాక్ వచ్చింది. హీరో రామ్ చరణ్ అతని పెంపుడు సోదరుల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు.  అలాంటిది ఒక సోదరుడి నిజాయితీ వల్ల తన ప్రాణాలు తన ముందే పోగొట్టుకోవడంతో అతనిపై రివేంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే సినిమా కథ.  అయితే ఈ మూవీలో యాక్షన్ డోస్ బాగా పెంచాడని విమర్శలు వచ్చాయి. ఫెయిల్యూర్ కి డైరెక్టరే బాధ్యత అంటూ అప్పట్లో మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే సంక్రాంతి కానుకగా ఎఫ్ 2 మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 

ఈ ఏడాది చెప్పుకోదగ్గ హిట్స్ లో మహర్షి అని చెప్పొచ్చు.  స్టార్ హీరోలు..భారీ బడ్జెట్ తో రూపొందిన సాహెూ, సైరా నరసింహారెడ్డి లాంటి మూవీస్ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే..ఓ విషయంలో 'వినయ విధేయ రామ’ రికార్డ్ తో పోటీ పడలేకపోయాయని అంటున్నారు. ఈ సంవత్సరం సూపర్ హిట్స్ గా నిలిచిన ఎఫ్ 2, మహర్షి, యావరేజ్ అనిపించుకున్న సాహో సినిమాలు తాజాగా ‘వినయ విధేయ రామ’ సినిమాతో  శాటిలైట్ రైట్స్ విషయంలో పోటీ పడలేక పోతున్నాయి.

తాజా సమాచారం మేరకు వినయ విధేయ రామ శాటిలైట్ రైట్స్ 23 కోట్లుకు అమ్మినట్లు టాలీవుడ్ టాక్. అందుకు కారణం బాలీవుడ్ లో పాపులర్ అయ్యిన కైరా అద్వాని, వివేక్ ఒబరాయ్ లీడ్ రోల్స్ లో ఉండటమే అంటున్నారు.  ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ 'వినయ విధేయ రామ'. అయితే బాలీవుడ్ లో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. . 'సరైనోడు' వంటి ఘనవిజయం తరువాత మెగా కాంపౌండ్‌లో బోయపాటి చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ మూవీ మెగా ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: