త్రివిక్రమ్ ల అలవైకుంఠపురములో
సినిమా, ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తూ ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు ఒక సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ చేసి మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం ప్రమోషన్స్ మాత్రం ఆలస్యం అవడానికి ఒక ముఖ్య కారణం ఉందట.
సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలలు గ్యాప్ ఉందని, కావున ఇప్పుడే సినిమాకు సంబందించిన అంశాలు కనుక రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తే, సినిమాపై ప్రేక్షకుల్లో రాను రాను అంచనాలు తారా స్థాయికి చేరతాయని, రిలీజ్ రోజున వారు అనుకున్న విధంగా ఏ మాత్రం
సినిమా లేకపోయినా, దానిని వారు రిజెక్ట్ చేసే అవకాశం ఉందని భావించి, దర్శకుడు
అనిల్ రావిపూడి,
సరిగ్గా రిలీజ్ కు ఒక నెల ముందుగా, అనగా
డిసెంబర్ లో పూర్తి స్థాయి ప్రమోషన్స్ మొదలెడదాం అని ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ విషయమై కొందరు
సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, ప్రస్తుతం సరిలేరు
సినిమా విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అనుకుంటే, దర్శకుడు
అనిల్ గారు భావిస్తుంది సరైనదే అని, కాకపోతే
మహేష్ బాబు వంటి పెద్ద హీరోల ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకు సంబందించిన సినిమా ప్రమోషన్స్ ఎంత త్వరగా మొదలెడితే అంత బాగుంటుందని భావిస్తుంటారనేది మాత్రం ఒకింత గుర్తుంచుకోవాలని అంటున్నారు.....!!