ఇప్పుడు ఇండస్ట్రీ హాటెస్ట్ మోడల్ కం హీరోయిన్ 'ఎవ్లీన్ శర్మ' గురించి అందరికి తెలిసిందే. తన హాట్ ఫొటోస్ తో గ్లామర్ పెర్‌ఫార్‌మెన్స్ తో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'టర్న్ లెఫ్ట్' అనే అమెరికన్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఎవ్లీన్ అనే ఈ ఆంగ్లో ఇండియన్ బ్యూటీ.. ఆ తరువాత బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించేందుకు చేయని ప్రయత్నమే లేదు. కెరీర్ ప్రారంభం నుంచి స్పెషల్ సాంగ్స్ లో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత కొన్ని క్రేజీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాలోనూ మెరిసిన 'ఎవ్లీన్ శర్మ' తన దాకా వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఇక 'ఎవ్లీన్' నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్ రే ది ఇన్నర్ ఇమేజ్'. థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కోసం ఎవ్లీన్ శర్మ పై ఓ ప్రమోషనల్ సాంగ్ ని రీసెంట్‌గా పిక్చరైజ్ చేశారు చిత్ర యూనిట్. 'జిగిలియా'... అంటూ సాగే ఈ రాపర్ సాంగ్ ని స్వాతీ వర్మ పాడారు.

ఇక ఇటీవలే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. పాటకు తగ్గట్టే జిగేల్ మనిపించే డ్రెస్సుల్లో ఎవ్లీన్ శర్మ జనలాకి హీటెక్కించేస్తోంది. 'దిల్బర్'...'చమ్మ చమ్మా'... గీతాలకు ఎవర్‌గ్రీన్ మ్యూజిక్ ని క్రియేట్ చేసిన రాజ్ అశూ ఈ పాటకు సంగీతం అందించడం విశేషం. షాబీర్ అహమ్మద్ రాసిన ఈ పాటకు రాప్ ని దిల్బర్.. ఫేమ్ ఇక్క అందించాడు. ఎవ్లీన్ లీన్ శర్మ వేడెక్కించే అందాలు ఈ వీడియో గీతానికి అస్సెట్.

ఈ గీతంలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఎవ్లీన్ రెచ్చి పోయి స్టెప్స్ వేయడం యంగ్ స్టర్స్ ని మాత్రమే కాదు అబౌ 60 ఇయర్స్ వాళ్ళను కూడా ఆకట్టుకుంటోంది. ప్రదీప్ కె. శర్మ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ కె రుయీ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక 'ఎక్స్ రే ది ఇన్నర్ ఇమేజ్' అన్న టైటిల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: