అల్లు అర్జున్ ను దురాస పరుడుగా చిత్రీకరిస్తూ ఒక ఇంగ్లీష్ దిన పత్రిక ప్రచురించిన కథనం పై అల్లు అర్జున్ తీవ్ర అసహనానికి లోనై తన పీఆర్ టీమ్ పై చిందులు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసక్తిని కలిగించే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే బన్నీ ఒక ప్రముఖ ఫ్యామిలీ షాపింగ్ మాల్ కు సంబంధించి బన్నీ ఆ సంస్థ యాజమాన్యానికి చుక్కలు చూపించాడు అని వచ్చిన వార్తలు మీడియాకు ఎలా లీక్ అయ్యాయి అంటూ బన్నీ తన పిఆర్ టీమ్ కు పెద్ద క్లాస్ పీకినట్లు టాక్. 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పట్టణం రాజమండ్రిలో ఒక ప్రముఖ వ్యాపార సంస్థ అతి త్వరలో ప్రారంభించ బోతున్న ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి బన్నీని ఆహ్వానిస్తే కోటి రూపాయల పారితోషికం హైదరాబాద్ నుండి రాజమండ్రి రావడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ అడగడంతో ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం బన్నీ కోరిక విని షాక్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం బన్నీని పక్కకు పెట్టి మరొ క్రేజీ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయాలు అన్నీ ఆ ఆంగ్ల దినపత్రిక వివరంగా వ్రాయడంతో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మీడియాకు ఎలా లీక్ అయ్యాయి అంటూ బన్నీ తన పీఆర్ టీమ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లీకులు తమ వద్ద నుండి వెళ్ళలేదనీ బన్నీతో మాట్లాడిన ఆ ఫ్యామిలీ షాపింగ్ మాల్ యాజమాన్యం ఆ పత్రికకు లీకులు ఇచ్చి ఉంటుంది అంటూ బన్నీ పిఆర్ టీమ్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఈ న్యూస్ ఇలా లీక్ కావడంతో ఇండస్ట్రీలోని కొందరు మరొక విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విజయ్ దేవరకొండ లాంటి హీరోలు 20 లక్షల వరకు అడుగుతున్న నేపధ్యంలో విజయ్ మార్కెట్ కంటే ఎన్నో రెట్లు మార్కట్ ఎక్కువ ఉన్న బన్నీ కోటి రూపాయలు డిమాండ్ చేయకపోతే అతడి విలువ ఏమి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: