బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ లు తాము నటించే సినిమాలు అన్నింటినీ తమ సొంత నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలను తీస్తూ కోట్ల రూపాయలలో లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ను మహేష్ ఇప్పటికే టాలీవుడ్ లో అనుసరిస్తున్నాడు.

జూనియర్ చరణ్ ప్రభాస్ లు కూడ మహేష్ ను అనుసరిస్తూ సొంత నిర్మాణ సంస్థల కార్యకలాపాల పై బాగా శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు వీరందరి స్పూర్తితో పవన్ కళ్యాణ్ కూడ ఇప్పటికే ప్రారంభించిన తన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ కు వేగం పెంచాలని స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది యంగ్ డైరెక్టర్స్ మరి కొంతమంది యంగ్ రైటర్స్ ను టీమ్ గా పెట్టుకుని వారి ఆద్వర్యంలో చిన్న సినిమాలు కనీసం సంవత్సరానికి రెండు తన సొంత బ్యానర్ పై ఉండే విధంగా ఆలోచనలు చేయడమే కాకుండా ఇప్పటికే ఈ దశగా ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు టాక్. ఈ యంగ్ టీమ్ ను తన ప్రియమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పెట్టి అతడి ఆద్వర్యంలో ఈ చిన్న సినిమాల వ్యవహారం నడిపించేవిధంగా పవన్ వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు. 

ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ కొనసాగాలి అంటే కోట్లాది రూపాయలలో నిధులు కావలసిన పరిస్థితులలో పవన్ తన చిన్న సినిమాల ఆదాయంలో కొంత భాగాన్ని ‘జనసేన’ కు ఖర్చుపెట్టే విధంగా ఈ ప్లాన్ ఉంది అని అంటున్నారు. అయితే పవన్ తాను నటించే సినిమాల కథల ఎంపికలోనే వైవిద్యం చూపించలేడు అన్న విమర్శలు ఉన్నాయి. దీనితో చిన్న సినిమాల కథల ఎంపిక విషయంలో ఆ మూవీల నిర్మాణ విషయంలో ఎంతో ఓపిక కావలసి ఉంటుంది. అలాంటి ఓపిక ప్రస్తుతం పవన్ కు ఉందా అన్నదే సందేహం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: