జార్జ్‌రెడ్డి.. ఈ పేరు వినగానే ఉస్మానియా యూనివర్శిటీలో 1968నాటి స్టూటెండ్‌ లీడర్‌ గుర్తుకువస్తాడు. చాలామందికి తెలియని ఆయన కథను తీసుకుని 'జార్జ్‌రెడ్డి' అనే సినిమా అప్పిరెడ్డి నిర్మించారు. 'దళం' చిత్రాన్ని రూపొందించిన జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 'వంగవీటి'లో రంగా పాత్రధారి ఎస్‌.వి.ఎస్‌. సందీప్‌ మాధవ్‌ (శాండీ) జార్జ్‌రెడ్డి పాత్ర పోషించారు. ''జార్జ్‌రెడ్డి పాత్ర వేయడానికి ఆయనకు సంబంధించిన వీడియోఫుటేజ్‌ను, స్నేహితుల నుంచి తెలుసుకుని ఫాలో అయ్యాను. ఆయన స్టూడెండ్‌ లీడర్‌గా చెరగని ముద్రవేశారు. ఆయన్ను చాలామంది స్టూడెండ్‌లీడర్లు స్పూర్తిగా తీసుకున్నారు. ఇది పూర్తి బయోపిక్‌ కాదు. ఇది ఎవర్ని ఉద్దేశించి టార్గెట్‌ చేసింది కాదు'' అని శాండీ తెలియజేస్తున్నారు. ఈనెల 22న విడుదలకానున్న ఈ చిత్రం గురించి ఆయన పలు విషయాలు తెలియజేశారు.


జీవన్‌ మీకు కథ ఎప్పుడు చెప్పారు?
    జీవన్‌, నేను రూమ్‌మేట్స్‌. 'దళం' సినిమాకు అసిస్టెంట్‌గా కూడా పనిచేశా. 'వంగవీటి' చిత్రం చేశాక దాదాపు 40 కథలు విన్నా. కానీ నన్ను అంతగా కదిలించిన కథ ఏదీ రాలేదు. అసలు వంగవీటి తర్వాత జార్జ్‌రెడ్డి లాంటి పాత్రే చేయాలనుకున్నా. అనుకోకుండా ఈ కథను జీవన్‌ నాకు చెప్పడం.. రోజూ దానిగురించే చర్చించడంతో బాగా కనెక్ట్‌ అయ్యా. ఈ పాత్రపై జీవన్‌ చాలా రీసెర్చ్‌ చేశారు.


ఈ పాత్ర కోసం ఎటువంటి కసరత్తు చేశారు?
    పాత్రకు తగినట్లుగా 22 నుంచి 25 ఏళ్ళ వయస్సుగల వాడిగా రెండు పార్శాలుంటాయి. చిన్నతనం, మెచ్యూర్డ్‌ రెండూ కలిసిన పాత్ర అది. అందుకోసం బాడీ వెయిట్‌ కూడా పెంచుకున్నా. తర్వాత కొంత తగ్గించుకున్నా. ఆయన బాక్సింగ్‌ చేసేవాడు. నేనుకూడా ఆరునెలలు బాక్సింగ్‌ మెళుకువలు నేర్చుకున్నా. ఫైర్‌బాల్‌ ఫైట్‌, చేతి కర్చీఫ్‌ తిప్పడం వంటివి ఆయన మేనరిజాలు. ఇవన్నీ ప్రాక్టీస్‌ చేశా. అప్పట్లో బిబిసి చేసిన 'క్రైసిస్‌ ఇన్‌ ద క్యాంపస్‌' ఫుటేజ్‌ చూశా. ఆయన చేసిన స్పీచ్‌.. మాడ్యులేషన్‌ పట్టాను. బాడీలాంగ్వేజ్‌ మార్చుకున్నా. ఆయన గురించి తెలిసినవారిని కలిసి వారితో మాట్లాడాను. 


స్క్రిప్ట్‌లో ఏది మీకు బాగా నచ్చింది?
    జార్జ్‌రెడ్డి గురించి చెప్పాక.. ఆయనకు సంబంధించిన న్యూస్‌ను బిబిసి.లో వేశారు. ఆ ఫుటేజ్‌ను, పుస్తకాల రూపంలో వున్నవి చదివాను. నేను ఉస్మానియాలో చదవకపోయినా అక్కడ వాతావరణం నాకు బాగా నచ్చింది. స్టూడెంట్స్‌ గార్డెన్‌లో చదువుకోవడం బాగా నచ్చింది. అక్కడ తిరుగుతున్నప్పుడు ఇలాంటిచోట స్టూడెండ్‌ లీడర్‌గా వుంటే బాగుండేదని అనిపించింది. అలాంటిది అనుకోకుండా జార్డ్‌రెడ్డి కథ చెప్పడంతో బాగా కనెక్ట్‌ అయ్యా.


ఆయన పర్సన్‌లైఫ్‌ చదువుతుంటే ఏమనిపించింది?
    ఆయన విజన్‌ వేరు. ఆయన బతికుంటే ఇండియా చాలా అడ్వాన్డ్‌గా వుండేదనిపించింది. ఇస్రోలో జాబ్‌ వస్తే వదిలేశారు. ఢిల్లీ యూనివర్శిటీనుంచి కాల్‌ వస్తే వెళ్ళలేదు. స్టూడెంట్స్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనే ఎక్కువగా కన్పించింది. ఆయన గురించి రాసిన ఆర్టికల్స్‌ చదువుతుంటే చివరికి వచ్చేసరికి కచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఫీల్‌ అవుతాము. ఇలాంటి మనిషినా మనం కోల్పోయింది అనిపిస్తుంది.  


'జ్యోతిలక్ష్మి'లో కామెడీటైం బాగా చేశారు. కానీ ఇప్పుడు సీరియస్‌ పాత్రలు చేస్తున్నారు?
'వంగవీటి' కూడా వస్తుందని అనుకోలేదు. 'జ్యోతిలక్ష్మి' తర్వాత పూరీతో ట్రావెల్‌ అవుతుండగా వర్మగారు నా నడక, ఆహార్యం చూసి... నువ్వు రంగాలా కన్పిస్తున్నావ్‌, అని ఫొటో చూపించి.. ఇలా లుక్‌ కావాలన్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు నువ్వే ఆ పాత్ర అని చెప్పేశారు.


ఈ చిత్రంలో 1968నాటి పరిస్థితులు చూపించారా?
    అప్పటి కాలానికి సంబంధించిన బైక్‌లను నిర్మాతలు కొనేశారు. అప్పటి వస్త్రధారణ, భాష కూడా ఎలా మాట్లాడతారో ఇందులో చూపించాం. ముఖ్యంగా ఉస్మానియా సెట్‌ వేసి తీశాం. అందరూ ఉస్మానియాలోనే తీశారనుకుంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు చాలానే తీసుకున్నాం. దానికితోడు కెమెరామెన్‌ సుధాకర్‌ ఎక్కంటిగారు 68కాలం నాటి కలర్‌ టింట్‌ తీసుకురావాలని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.


అప్పటికీ ఇప్పటికీ స్టూడెంట్స్‌లో మీరేమి గమనించారు?
    నేను బిఎస్‌సి. హైదరాబాద్‌లోనే చేశా. మామూలుగా స్టూడెంట్స్‌ అంటే మందు, అమ్మాయిలతో తిరగడం అనుకుంటారు. కానీ అప్పట్లో సమాజంలో బాధ్యతగల లీడర్‌గా జార్జ్‌రెడ్డి కన్పిస్తాడు. అప్పటి విద్యార్థులకు, ఇప్పటి కుర్రాళ్ళకు చాలా తేడా వుంది. అప్పట్లోనే మెచ్చూర్డ్‌గా ఆలోచించిన వ్యక్తి జార్జ్‌రెడ్డి. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరిగే రోజులు. ఆడవాళ్ళను చదవుకోవడానికి పంపించేవారు కాదు. అలాంటిది వాళ్ళలోనూ స్పూర్తిరగిలించాడు.


ప్రీరిలీజ్‌కు పవన్‌కళ్యాణ్‌గారు రాకపోవడం ఎలా అనిపిస్తుంది?
    పవన్‌కళ్యాణ్‌గారు ప్రీరిలీజ్‌కు రావాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల రాలేకపోతున్నారు. నేను పవన్‌ ఫ్యాన్‌ను. ఆయన కూడా జార్జ్‌రెడ్డి కథ తీయాలనుకున్నారు. ఆయన అభిమానిగా నేను చేయడం అదృష్టంగా ఫీలవుతున్నా. 


ఇకపై ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
    'వంగవీటి' తర్వాత అన్నీ ఆ తరహానే వస్తున్నాయి. నాకు కొంచెం ఛేంజ్‌ఓవర్‌ కావాలి. 'జ్యోతిలక్ష్మి' తరహా కామెడీటైప్‌ పాత్రలు చేయాలనుకుంటున్నా. వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: