ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసందే.  ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘జార్జిరెడ్డి’ సినిమా తెరకెక్కింది. అయితే బయోపిక్ మూవీస్ విషయాల్లో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు విషయాన్ని వక్రీకరించి కల్పిత కథను ప్రజలకు చూపిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి.  ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ మూవీ రాణి పద్మావతి కథను వక్రీకరిస్తున్నారని అప్పట్లో రాజ్‌పుత్ సామాజికవర్గం చిత్ర యూనిట్‌పై తిరగబడింది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత వారి ఆరోపణలు వెనక్కి తీసుకున్నారు. 

తర్వాత కంగనా రౌనత్ నటించిన ‘మణికర్ణిక’ (ఝాన్సీ లక్ష్మీభాయి) జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం పై కూడా విమర్శలు చేశారు. ఆ మద్య స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం పై కూడా విమర్శలు వచ్చాయి. కథను వక్రీకరించారని ఆరోపించారు.  తాజాగా 'జార్జిరెడ్డి' సినిమాపై వివాదం నెలకొంది. విద్యార్థి నేత అయిన జార్జిరెడ్డి జీవితకథతో తెరకెక్కిన ఈ సినిమాపై ఏబీవీపీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.  ‘జార్జిరెడ్డి’ చిత్ర యూనిట్ అసత్య ప్రచారానికి తెరతీస్తోందని, ఒక హింసావాదిని హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

నిజానిజాలను సెన్సార్ బోర్డు విచారించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఉద్రిక్తతల నేపథ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. కాగా,  నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ మూవీ రిలీజ్ కాబోతుంది.  ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ మూవీకి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రం నిర్మించారు. తారాగణం ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్  రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఈ ఆర్టికల్ కవర్ చేయబడినది. 


మరింత సమాచారం తెలుసుకోండి: