సినిమా హిట్టవ్వాలంటే కేవలం కంటెంట్ ఒక్కటే సరిపోద్ది అన్నది అన్ని సందర్భాల్లో నిజం అవదు. మంచి కాన్సెప్ట్ ఉన్నా సరే సరైన కాస్టింగ్ లేకుంటే సినిమా ఆశించిన స్థాయిలో ఆడే అవకాశం ఉండదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ వాళ్లతో సినిమా చేస్తే అదరగొట్టే డైరక్టర్స్ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి.


వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ ఆలోచనే ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చేస్తాయి. మరి అలాంటి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా చెప్పుకునే కాంబో సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబో. కొన్నాళ్లుగా ఈ కలయికలో సినిమా వస్తుందని అనుకుంటున్నా అది మాత్రం కుదరట్లేదు. ఇదే క్రమంలో బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ తో త్రివిక్రం తో సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 


ఇక పవన్ మళ్లీ సినిమాలు చేస్తే రాజమౌళి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తే ఇక ఆ సినిమా అంచనాలకు ఆకాశమే హద్ధు అనేలా ఉంటుంది. ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నథ్ కాంబినేషన్ లో మూవీ కూడా సెట్స్ మీఅకు వెళ్లాల్సి ఉంది. ఆటోజాని అనే టైటిల్ పెట్టి మరి పూరి చిరు కోసం వెయిట్ చేస్తునాడు. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో సూపర్ హిట్ సినిమాలు చేసిన త్రివిక్రం వెంకటేష్ ను డైరెక్ట్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ కాంబినేషన్ కోస్మ తెలుగు సిని లవర్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో నాగార్జున, బాలకృష్ణలు కూడా యంగ్ డైరక్టర్స్ తో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలన్ని వస్తే మాత్రం మరోసారి తెలుగు సినిమా స్టామినా నేషనల్ వైడ్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: