ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపెంట్స్ అయిన రాహుల్ మరియు పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికే కొద్దిరోజులుగా వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సీజన్ లో రాహుల్ టైటిల్ విజేతగా నిలిచి మెగాస్టార్ చిరంజీవి నుండి షీల్డ్ అందుకోగా, పునర్నవి మధ్యలోనే ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే షో మధ్యలో వీరిద్దరూ ఎంతో చనువుగా ఉండడం, అలానే రాహుల్ మధ్యలో డేంజర్ జోన్ లో పడ్డప్పుడు పునర్నవి, అలానే పునర్నవి ఎలిమియేట్ అయినపుడు రాహుల్, ఇద్దరూ కూడా ఎంతో బాధతో ఏడవడంతో, నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉందని, షో ముగిసిన తరువాత తప్పకుండా వారు పెళ్లి చేసుకుని తీరుతారని వార్తలు వచ్చాయి. 

 

ఇకపోతే నేడు ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఆలీతో సరదాగా షో కు విచ్చేసిన వారిద్దరూ, తమ వ్యక్తిగత మరియు బిగ్ బాస్ షో విషయాలను పంచుకోవడం జరిగింది. అయితే షో మధ్యలో ఆలీ మాట్లాడుతూ, మీరిద్దరి మధ్య ఏదైనా ఉందా, ఉంటె చెప్పండి అంది అడుగగా, అవును ఉంది, అదేమిటంటే మంచి స్నేహం. మా ఇద్దరికీ ఒకరు అంటే మరొకరికి ఎంతో ఇష్టం, ఎందుకంటే బిగ్ బాస్ షో మొదట్లో మా ఇద్దరికీ ఒకరు అంటే మరొకరికి పడేది కాదు, అయితే రాను రాను ఒకరి గురించి మరొకరం అవగాహన చేసుకున్న తరువాత మా మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏర్పడిందని చెప్పడం జరిగింది. 

 

ఇక షోలో మా ఇద్దరి రిలేషన్ చూసి, డెఫినెట్ గా మేము ప్రేమించుకుంటున్నాం అని షోలో వారిలో కొందరు కూడా అనుకున్నారని, అయితే అందరూ భావిస్తున్నట్లు అటువంటిది తమ మధ్య ఏమి లేదని, ఒకరంటే మరొకరికి ఎంతో అబిమానం మాత్రమే ఉందని అని ఇద్దరూ చెప్పుకొచ్చారు. అయితే కొసమెరుపు ఏంటంటే, వారిద్దరూ అలీతో ఎంతో జాలీగా తమ విషయాలు పంచుకున్నప్పటికీ, మేమిద్దరం పెళ్లి చేసుకోబోవడం లేదనే అనే విషయాన్ని మాత్రం గట్టిగా ఖండించకపోవడం అంటూ, పలువురు నెటిజన్లు వారిపై సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్  ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది... !!

మరింత సమాచారం తెలుసుకోండి: