సౌత్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ నయనతార. భారీ క్రేజ్, అభిమానులు, హీరోలతో సమానంగా కటౌట్లు నయన్ సొంతం. లేడీ సూపర్ స్టార్ గా ప్రస్తుతం దక్షిణాదిని ఏలేస్తున్న నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉంది. ఖాళీ దొరికితే ఈ జంట విహారయాత్రల్లో తేలిపోతూంటారు. ప్రస్తుతం కూడా మియామీలో సందడి చేస్తోందీ జంట. నవంబర్ 18 నయనతార పుట్టినరోజు కావడంతో వీరిద్దరూ మియామీ చెక్కేశారు.

 

 

నయన్ తన పుట్టినరోజును విఘ్నేశ్ శివన్ తో కలిసి మియామీలో జరుపుకుంది. చట్టాపట్టేలేసుకుంటూ అక్కడి నగర వీధుల్లో సందడి చేస్తున్న పోటోలను సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ‘హ్యాపీ బర్త్ డే టు 9’ అని ఉన్న కేకు కట్ చేస్తూ నయేన్ పుట్టిన రోజును నిర్వహించాడు విఘ్నేశ్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇది వరకే పెళ్లైందని రకరకాల వార్తలు షికారు చేస్తున్నా వీరిద్దరూ ఆ వార్తలను పట్టించుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా అమెరికాలో వాలిపోతుంటారు ఈ లవ్ బర్డ్స్. ప్రస్తుతం బర్త్ డే మూడ్ లో వీరు అమెరికాలోనే మకాం వేయనున్నారు. నాన్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ సమయంలో విఘ్నేశ్ తో ప్రేమలో పడింది నయనతార. అప్పటి నుంచి ఏ ఫంక్షన్ కు వెళ్లినా.. ఏ ఈవెంట్ లో పాల్గొన్నా ఇద్దరూ కలిసే వెళ్తున్నరు. దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

 

కానీ.. నయన్ కాల్షీట్స్ ప్రకారం చూస్తే ఆమె ఫుల్ బిజీ ఆర్టిస్ట్. ఆమెకు తమిళంలో సినిమాలు ఉన్నాయి. విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో ఆమె మెయిన్ రోల్ పోషిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన దర్బార్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: