సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది నెలల్లోనే సాయి పల్లవి టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. నిజానికి చాలా మంది హీరోలు ఆమె తో జతకట్టి నటించడానికి మరియు స్టెప్పులు వేయడానికి జంకారు కూడా. భాషతో తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా తన నటనతో మరియు నాట్యంతో అకట్టుకునే సత్తా ఉన్న సాయి పల్లవి తనకంటూ కొన్ని ఆంక్షలు విధించుకుంది. ప్రస్తుతం రాణా హీరోగా వస్తున్న 'విరాటపర్వం' లో నటిస్తున్న ఈ కేరళ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన మరో సినిమా చేస్తుంది. 

 

కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా తన కాళ్ళ దగ్గరకు వచ్చిన కోటి రూపాయలు కాదన్నారు. ఈ 'ప్రేమమ్' భామ ఇప్పటికే చాలా టెలివిజన్ కమర్షియల్స్ మరియు ప్ర్రాడెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చిన అవకాశాలను వద్దనుకున్న సంగతి తెలిసిందే. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కోట్ల రూపాయలకు ఇస్తామంటూ వస్తున్న వారందరినీ వద్దని చెప్పేసిన సాయి పల్లవి తాజాగా ఒక వస్త్ర సంస్థ కి కూడా నో చెప్పడం గమనార్హం.

 

అంతకు ముందు బ్యూటీ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు నిరాకరించిన సాయి పల్లవి కి ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ సంస్థ అక్షరాలా కోటి రూపాయలు ఇస్తామన్నా తాను ఇది చేయలేను అని చెప్పింది. తన కారణాలు తనకి ఉన్నా ఇదే ఇదే సంస్థ కి నాగచైతన్య కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా ఆమె దీనిలో ఎలాంటి ఆసక్తి చూపించలేదు. జార్జియాలో తన ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి డాన్స్ షో లలో తన ప్రతిభను నిరూపించుకుని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అగ్రతారల మధ్యన వెలుగొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: