మెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్  స్టార్ మా ఛానల్ వినూత్నంగా ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా  మెన్స్ డే శుభాకాంక్షల్ని తెలియ చేయడం జరిగింది బుల్లితెర నటీనటులు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్స్ వితికా, వరుణ్‌లు సైతం కనిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మొదటిగా వరుణ్ మెన్స్ డే శుభాకాంక్షల్ని తెలియజేసి.. ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అని అన్నది వితికా. నా వెనుక నాభార్య వితికా ఉందని చెప్పగా.. ‘ప్రతి ఉమెన్స్ డేకి నాకు గిఫ్ట్ ఇస్తావ్ కాబట్టి..ఈ మెన్స్‌డేకి నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని’ ప్రామిస్‌ చేయడం జరిగింది.

 

ఆ తర్వాత  స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ నటీనటులు ఒక్కొక్కరుగా విషెష్ తెలియచేయడం జరిగింది. ఇక స్టార్ మాలో ‘వదినమ్మ’  సీరియల్ తిరిగి పూర్వవైభవం అందుకున్న ఈటీవీ ప్రభాకర్.. ఎప్పటిలాగే డిప్లమేటిక్‌ మాట్లాడుతూ.. మెన్స్ డే విషెష్ తెలియజేయడం జరిగింది. ‘నాకు తెలిసి ప్రతి రోజు మెన్స్‌ డేగానే ఉంది. మెన్స్ అని జరుపుకునేలా ఉమెన్స్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అన్నాడు. ప్రతి రోజు ఉమెన్స్ డే అవ్వాలి. అప్పుడే మెన్స్ డే అనేది మెన్షన్ చేయడానికి చాల సంతోషంగా ఉంటుంది అని తెలిపారు.

 

ఇంకా  ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మెన్స్ డామినేటింగ్‌గా ఉన్నారు. అలా ఉండకూడదు మనము. ఉంటే సమానంగా ఉండాలి లేదంటే.. లేడీస్ డామినేటింగ్‌గా ఉండాలి అని తెలిపారు. అప్పుడే మేం మెన్స్ డే జరుపుకోగలం. వాళ్లకు ఏదైనా చేసి మనం మెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ తెలియచేయడం జరిగింది ప్రభాకర్. ఇక ఇదే వీడియోలో ‘కార్తీకదీపం’ ఫేమ్ సౌందర్య, మౌనికలు సైతం మెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. మౌనిత ‘డాక్టర్ బాబూ మెన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ నవ్వులు సరదాగా గడిపారు. ఇక సౌందర్య మెన్ అండ్ ఉమెన్ అంతా సమానమే అంటూ శుభాకాంక్షలు అందచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: