రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ ఎంపికైంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

 

అయితే సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని ఆర్.ఆర్.ఆర్ చిత్రయూనిట్ లేటెస్ట్ గా రేపు అనగా నవంబర్ 20న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరన్నది రివీల్ చేస్తున్నారట. అంతేకాదు సినిమాలో ప్రతినాయకుడు సంబందించిన వివరాలు ఎనౌన్స్ చేస్తారట. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నాడు.

 

కొమరం భీం పాత్రలో తారక్ చేస్తున్నాడు. రాం చరణ్ కు జోడీగా అలియా భట్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. తారక్ కు జోడీ ఎవరన్న్నది మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. అయితే ఆ హీరోయిన్ లేకుండానే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేశారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటివరకు 70 శాతం పూర్తయిందని చెప్పి షాక్ ఇచ్చారు.

 

రాజమౌళి అనుకున్న విధంగానే 2020 జూలై 20న ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. తారక్, చరణ్ ఇద్దరు పోటాపోటీగా ఈ సినిమాలో నటిస్తున్నారట. అంతేకాదు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని సినిమాలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న. ముఖ్యంగా ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్.. ఇంటర్వల్ ఫైట్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోవడం కష్టమే అని ఫిల్మ్ నగర్ టాక్. మరి రాజమౌళి నుండి వస్తున్న మరో అద్భుత సృష్టి ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమా నిర్మాత డివివి దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. బాహుబలి కాదు ఈ సినిమా దాన్ని మించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: